32.2 C
Hyderabad
May 9, 2024 22: 36 PM
Slider ఆధ్యాత్మికం

విదేశాల్లో యోగ విద్య విస్తరణకు కృషి

#gurujee

మూడు నెలలో 14 రాష్ట్రాలలో 12 విమానాల ద్వారా అమెరికాలో ఉంటున్న ఉషాభారతి, ప్రభాకర్ ల ద్వారా యోగ విద్యను విశ్వ వ్యాప్తం..ఆ స్వామీజీ నే నాతో చేయించారని స్వామి శ్రీరామానంద యోగజ్ఞానాశ్రమ పీఠాధిపతి శ్రీగురూజీ అన్నారు. ఉదయం ఆశ్రమం రోడ్ నుంచీ కోలాటాల నృత్యం తో  మేళతాళాలతో శ్రీగురూజీ దంపతులను ఊరేగింపు తీసుకొచ్చిన అనంతరం ఆశ్రమంలో పాదపూజ చేసిన తర్వాత శ్రీగురూజీ తన ఆమెరికా పర్యటన విశేషాలను తెలియజేసారు.

సెప్టెంబర్ 15 నుంచీ డిశెంబర్ 15 వరకు 14 రాష్ఠ్రాలలో యోగ విద్యను స్వామిజీ నే నాతో ప్రచారం చేయించారని శ్రీగురూజీ తెలిపారు. తిరుపతి కి చెందిన ఉషా భారతి ,ప్రభాకర్ లు ఆమెరికాలో ఉంటూ..తన ద్వారా ఈ యోగ విద్య ను ప్రచారం చేయించడంలో భాగస్వామ్యం అయ్యారని చెప్పారు. జనవరి 22 వాళ్లిద్దరితో పాటు కొంత మంది ఆశ్రమానికి వస్తున్నారని…అలాగే ప్రముఖ సినీ నేపధ్యగాయకుడు మనో కూడా వస్తున్నారని శ్రీగురూజీ ఈ సందర్భంగా తెలియజేసారు.

ఇక శ్రీగురూజీ ప్రసంగం అనంతరం యావన్మంది శిష్యులు… ఆశ్రమం లో భోజన రూపంలో ప్రసాదం తినడంతో కార్యక్రమం పూర్తయింది. ఈ కార్యక్రమంలో శ్రీగురూజీ కొడుకు, కోడలు తేజస్విని, శివలతో పాటు అల్లుడు, కూతురు ఝాన్శీ శంకర్ లు అలాగే డా.హరగోపాల్, లక్ష్మణరావు, డా.సుబ్రహ్మణ్యం, రవిశాస్త్రి,విజయగోపాల్, చక్రవర్తి, జగ్గారావు, శోభ ,అరుణ,రామకృష్ణ,శతృఘ్నకుమార్, అలాగే విజయవాడ,విశాఖ, నెల్లూరు, తదితర ప్రాంతాల నుంచీ శిష్యులు పాల్గొన్నారు.

Related posts

పరిశ్రమలు తెచ్చి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేస్తా

Bhavani

అనంత్ నాగ్ జిల్లాలో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం

Satyam NEWS

సమ్మోహనపరిచే లఘు చిత్రం ‘ఏ డేట్ ఇన్ ది డార్క్’

Satyam NEWS

Leave a Comment