Slider ఖమ్మం

1.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారoభo

#Development works

ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో రూ.1.50 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శంఖుస్థాపనలు, ప్రారంబోత్సంచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరాభివృద్దిలో భాగంగా కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలకు అవసరమయ్యే మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఖమ్మం నగరం పలు డివిజన్‌లలో ఎస్‌డిఎఫ్‌ నిధులు రూ.90 లక్షలు, సుడా నిధులు రూ.60 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. 25ఏళ్లకు సరిపడే అభివృద్ది కేవలం గడచిన ఐదేళ్లలో పూర్తి చేయ గలిగామని, అది తెలంగాణ ప్రభుత్వం వల్లే సాధ్యం అయిందన్నారు. ఎస్‌డిఎఫ్‌ నిధులు రూ.90 లక్షలతో శంకుస్థాపన, సుడా నిధులు రూ.60లక్షలతో సైడ్‌ కాల్వలు, సి.సి రోడ్స్‌ నిర్మాణ పనులు మొత్తం రూ.1.50కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను నేడు ప్రారంభించడం జరిగిందన్నారు.

నగరంలోని 4వ డివిజన్‌ పాండురంగ పురంలో ఎస్‌డిఎఫ్‌ నిధులతో రూ.90లక్షలతో నిర్మించనున్న సైడ్‌ డ్రెయిన్ల నిర్మాణ పనులకు, 45వ డివిజన్‌ మామిళ్లగూడెం లో సుడా నిధులురూ.20లక్షల తో నిర్మించిన సి.సి రోడ్లు, డ్రెయిన్లను, 50వ డివిజన్‌ బైపాస్‌ రోడ్డులో గల ఎస్సీ కాలనీలో సుడా నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన సి.సి రోడ్లు, డ్రెయిన్లను, 53వ డివిజన్‌ గట్టయ్యా సెంటర్‌ వద్ద బోడేపూడి స్థూపం దగ్గర సుడా నిధులు రూ.20లక్షలతో గట్టయ్య సెంటర్‌, 53వ డివిజన్‌లో సి.సి రోడ్లను మంత్రి ప్రారంభోత్సవం చేశారు.

Related posts

తమిళనాడును నలిపేస్తున్న మర్కజ్ జమాత్

Satyam NEWS

మల్లికార్జున్ మరణం బాధాకరం: సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

సజ్జల కమిటీతో చర్చలకు వెళ్లని ఉద్యోగ సంఘాలు

Satyam NEWS

Leave a Comment