31.7 C
Hyderabad
May 2, 2024 09: 49 AM
Slider నల్గొండ

కరోనా టెస్టులు ప్రజలందరికీ విస్తృతంగా చేయాలి

#MDAzizPasha

రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ హాస్పిటల్స్ కి కొమ్ముకాయకుండా ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి దోచుకుంటున్న  ప్రైవేట్ హాస్పిటల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టి పి.సి.సి జాయింట్ సెక్రటరీ ఎండి. అజీజ్  పాషా డిమాండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఆధీనంలోకి ప్రైవేట్ హాస్పిటల్స్ ను తీసుకుని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు.

కరోనా కాలంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని, మొబైల్ టీముల ద్వారా అన్ని వార్డులలో కరోనా టెస్టులు  నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా  కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు విస్తృతంగా చేయాలని, కరోన మూలంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలు పరిష్కరించాలని  డిమాండ్ చేశారు.

కరోనా కేసులు విపరీతంగా ఉన్నప్పటికీ టెస్టులు చేయక పోవడం మూలంగా కేసులు బయట పడటం లేదని, కేసుల వివరాలతో కూడిన వివిధ జిల్లా,మండల, నియోజకవర్గ కేంద్రాల్లో హెల్త్  మెడికల్ బులిటెన్ విడుదల చేయకపోవడం సరైంది కాదన్నారు.

అన్ని మండల ప్రభుత్వ ఆస్పత్రి కేంద్రాలలో  కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వచ్చేటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి హాస్పిటల్ లో సరియైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని వార్డుల్లో కరోనా పరీక్షలు నిర్వహించి ప్రజలందరికీ మాస్కులు, శానిటైజర్ లు అందించాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాధి చికిత్సను ఆరోగ్యశ్రీ లో చేర్చి వైద్యాన్ని ఉచితంగా అందించాలన్నారు.

కరోనా పాజిటివ్ వచ్చిన రోగులకు హోమ్ క్వారంటఐన్ లో  ఉన్నవారికి ప్రభుత్వమే పౌష్టిక ఆహారాన్ని అందజేయాలన్నారు. ప్రతి పేద కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా నెలకు 7500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు దోమలను నివారించి అంటువ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని కోరారు.

Related posts

సినీ అతిరధుల సమక్షంలో ప్రారంభమైన హీరో కిరణ్ ఆబ్బవరం “రూల్స్ రంజన్”

Satyam NEWS

‘14 డేస్ లవ్’లోని ‘ఏమ్ మాయో చేసేసి’ లిరికల్ సాంగ్ విడుదల

Bhavani

సెప్టెంబర్ 1నుండి అగ్నివీర్ ర్యాలీ

Bhavani

Leave a Comment