27.7 C
Hyderabad
April 30, 2024 09: 26 AM
Slider ముఖ్యంశాలు

వితంతువులకు సంక్షేమ పథకాలు అందించాలి

#Nizamabad Colloctor

ఆధారమైన  మనిషి తోడు లేకపోవడంతో సమాజం నుండి ఎదురయ్యే ఒత్తిళ్లను అనుభవిస్తూ వైవిధ్య భరితమైన జీవితాన్ని అనుభవిస్తున్న వితంతు, ఒంటరి మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత కల్పించాలని వితంతు ఒంటరి మహిళా సమస్యల సాధన సంక్షేమ సంఘం నిర్వాహకుడు సంద బాబు  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కార్యాలయంలో కలెక్టర్ సి. నారాయణరెడ్డి కి  వినతిపత్రం అందించారు. 

వితంతువులు వివక్ష అసమానతల మధ్య బతు కెళ్ల దీస్తూ, శారీరక, మానసిక, ఆర్థిక ,రాజకీయ, సామాజిక రంగాల్లో వెనుకబడి పోయారని  ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రాధాన్యతలో కూడా ఆదరణ లేక  గ్రామాల్లో  వితంతు, ఒంటరి మహిళల కుటుంబాలు దీనస్థితి చేరుకున్నాయని ఆయన తెలిపారు.

గ్రామస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు వారి  కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని వితంతువుల జీవనోపాధులు మెరుగుపడేలా కృషిచేయాలని, వితంతువుల పట్ల సమాజం  అమానవీయ కోణంలో ఆలోచన ధోరణి  ఉందని దీన్ని రూపుమాపడానికి  ప్రతి ఒక్కరూ భాగస్వాములై వితంతు మహిళలకు బాసటగా నిలబడేలా అధికారులు కృషిచేయాలని వినతిపత్రంలో కోరారు.

Related posts

ప్రజా వినతులను పరిష్కరించాలి

Satyam NEWS

రెండు వారాల ప్రాక్టీస్ ఓరియెంటెడ్ ఇంటర్న్‌షిప్

Bhavani

చిరంజీవి కొత్త చిత్రానికి టైటిల్ ‘వీరయ్య’ ?

Satyam NEWS

Leave a Comment