40.2 C
Hyderabad
May 2, 2024 18: 34 PM
Slider నల్గొండ

కరోనా మృతుల కుటుంబాలకు రూ.15లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

#Congress

కరోనా వైరస్ సోకడంతో అనేక మందికి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అనాథలు అయ్యారని అలాంటి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో TPCC రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ అజీజ్ పాషా మాట్లాడుతూ బ్లాక్ ఫంగస్ వారికి ఇచ్చే (యాంఫో టెరిసిన్-బి) ఇంజక్షన్స్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

కరోనా వైరస్ ఉరుము లేని పిడుగులా విరుచుకు పడుతు ఎన్నో కుటుంబాలను అల్లకల్లోలం చేస్తుందని ఆయన అన్నారు. పలు రాష్ట్రాలు ఇప్పటికే  మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఉదారంగా వ్యవహరిస్తున్నారని, లక్షల్లో పరిహారాలు చెల్లిస్తున్నారని, పైగా వారి పిల్లలకు చదువుల కోసం భరోసా కల్పిస్తూ డిగ్రీ వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నారని అన్నారు.

తెలంగాణా రాష్ట్రంలో కూడా P.M. కేర్, సీఎం సహాయనిధికి వచ్చే విరాళాలను, రివాల్వింగ్ ఫండ్ రూపంలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం రూ.15 లక్షలు తక్షణమే చెల్లించాలని, వారి పిల్లలకు పూర్తి స్థాయిలో డిగ్రీ వరకు విద్యను ప్రభుత్వమే అందించి వారికి ప్రతినెలా ఆర్థిక సహాయం భృతి అందించాలని, కరోనాను ‘ఆరోగ్యశ్రీ’ కింద చేర్చి ఉచితంగా ప్రజలకు వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముషం సత్యనారాయణ, జక్కుల మల్లయ్య,ఇట్టిమల్ల బెంజిమెన్, సమ్మెట సుబ్బరాజు,సంక్రాంతి కోటేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జొన్నలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా…

Satyam NEWS

9 ఏళ్ల ప్రధాని మోడీ పాలన లో ఏం చేశామంటే….!

Satyam NEWS

సోమశిల – సిద్దేశ్వరం వంతెన సాధించిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment