40.2 C
Hyderabad
April 29, 2024 15: 23 PM
Slider నిజామాబాద్

జొన్నలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా…

#farmers protest

పండించిన జొన్నలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ రైతులు పిట్లం, బాన్సువాడ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అధికారుల సూచన మేరకు గ్రామంలో రైతులు జొన్న సాగు చేశారని తెలిపారు. 

పండించిన ధాన్యo ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కుప్పలుగా పోసి ఉంచామని తెలిపారు. మూడు నెలల దాటినా కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయడం లేదని అన్నారు. వర్షాలకు జొన్నలకు మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రభుత్వం కొనుగోలు చేయక పోవడంతో చేసిన అప్పులు తీర్చలేక, ఖరీఫ్ పెట్టుబడులు లేక అవస్థలు పడుతున్నామని అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

రైతుల ధర్నాతో పిట్లం బాన్సువాడ మధ్య ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులతో మాట్లాడారు.తహసీల్దార్ రామ్మోహన్రావు  అధికారులతో  మాట్లాడి సమస్యను ప్రష్కరించు కుందామని చెప్పడంతో ధర్నా విరమించారు.

Related posts

కలకలం రేపుతున్న కాపు కుల సంఘాల సమావేశాలు

Satyam NEWS

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మ‌క్షంలో బీఆర్ఎస్ లో చేరిక‌లు

Bhavani

బీజెపీ విజయానికి పునాది వేసిన ప్రజా సంగ్రామ పాదయాత్ర

Satyam NEWS

Leave a Comment