32.7 C
Hyderabad
April 26, 2024 23: 51 PM
Slider ప్రపంచం

పోలీసులే కొట్టారా: వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కి గాయాలు

mehul Choksi arrested in dominica wuth wounds in jail police antigua


రూ.13,578వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ వెలుగులోకి వచ్చాక దేశం వదిలి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ గాయాల పాలై కనిపించడం పై విమర్శలు చెల రేగుతున్నాయి. గత ఆదివారం ఆంటిగ్వాలో కనిపించకుండా పోయిన మెహుల్​ చోక్సీ రెండు రోజుల తర్వాత పక్కనే ఉన్న డొమినికా దీవిలో పోలీసులకు చిక్కారు. ఆంటిగ్వాలోని జాలీ హార్బర్ నుంచి ఆంటిగ్వాన్-ఇండియన్ లాగా కనిపించే పోలీసులు తనని అపహరించి డొమినికాకు తీసుకెళ్లి హింసించారని చోక్సి ఆరోపించారు.


కాగా మెహుల్ చోక్సీని అపహరించి హింసించారనే ఆరోపణలను ఆంటిగ్వా పోలీసు చీఫ్ ఖండించారు. ఇక. డొమినికా జైలులో ఉన్న మొహుల్ చోక్సీ ఫొటోలను ఆంటిగ్వా న్యూస్‌ రూమ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఇందులో చోక్సీకి చేతికి, ఎడమ కంటికి గాయాలు, వాపు ఉండడం కనిపిస్తోంది.


అయితే ఈ విషయమై ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఆదివారం పాయింటీ ఎఫ్ఎమ్ రేడియో ఛానల్ లో ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్​ మాట్లాడుతూ మొహుల్ ఛోక్సీ పొరపాటు చేశాడని అన్నారు. చోక్సీ తన గర్ల్​ఫ్రెండ్​తో సరాదాగా రొమాంటిక్​ ట్రిప్​ కోసమని డొమినికా వెళ్లి అక్కడి పోలీసులకి చిక్కి ఉంటాడని ఆంటిగ్వా ప్రధాని చెప్పారు. ఇక, మొహుల్ చోక్సీని తీసుకెళ్లడానికి ఈ నెల 28న ఇండియా ఓ ప్రైవేట్ జెట్‌ను పంపించినట్లు వచ్చిన వార్తలు నిజమేనన్నారు.


డొమినికాలోని డగ్లస్‌-చార్లస్ ఎయిర్‌పోర్ట్‌లో భారత్​ కు చెందిన ఓ ప్రైవేటు జెట్ వేచి చూస్తోందని ఆంటిగ్వా ప్రధాని కన్ఫర్మ్ చేశారు. చోక్సీని తిరిగి అప్పగించడానికి అవసరమైన డాక్యుమెంట్లు కూడా ఈ విమానంలో వచ్చినట్లు తెలిపారు.

దీనిపై భారత అధికారుల నుంచి ఇప్పటి వరకూ స్పష్టమైన సమాధానం రాలేదు. బుధవారం వరకూ చోక్సీని భారత్‌కు అప్పగించకుండా డొమినికాలోని కోర్టు జడ్జి స్టే విధించారు. దీంతో భారత ప్రభుత్వం ఈ పత్రాలను పంపించి, అతన్ని ఎలాగైనా తిరిగి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది అని ఆయన తెలిపారు.
డొమినికా నేరుగా అతన్ని ఇండియాకే అప్పగించాలని తాను అభ్యర్థిస్తున్నట్లు కూడా చెప్పారు. ఒకవేళ అతడు మళ్లీ ఆంటిగ్వాకు వస్తే ఇక్కడ అన్ని చట్టపరమైన, రాజ్యాంగ రక్షణలు అతనికి దక్కుతాయి అని బ్రౌన్ తెలిపారు.

Related posts

సోనియా, రాహుల్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్

Bhavani

కోవిడ్ బాధితుల్ని పరామర్శించిన హుజుర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి

Satyam NEWS

కోమటిరెడ్డి ని ఇంకెంత కాలం భరిస్తారు….?

Satyam NEWS

Leave a Comment