42.2 C
Hyderabad
May 3, 2024 18: 24 PM
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం శంకర్ ఫౌంటేషన్ కంటి ఆసుపత్రిలో ప్రభుత్వ పథకం సేవలు

#shankarfoundation

ఉత్తరాంద్ర జిల్లాల్లో నాణ్యమైన కంటి వైద్యం అందించడంలో ప్రఖ్యాతి గాంచిన శంకర్ పౌంటషన్ కంటి ఆసుపత్రి సింహద్వారం శ్రీకాకుళం డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పధకాలను ప్రారంభించారు.  ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న పెద్ద ప్రజలు,  ఇ.హెచ్.ఎస్ కార్డు ఉన్న ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని ఉచితంగా కన్సల్టేషన్, శస్త్ర చికిత్సలు చేయించుకోవాలని ఆసుపత్రి పౌర సంబంధాల అధికారి  బంగార్రాజు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇప్పటి వరకు శ్రీకాకోళం లోని కంటి ఆసుపత్రి సుమారు 1500 కంటి శస్త్ర చికిత్సలు నిర్వ హించింది. అత్యాధునిక సదుపాయాలతో ఈ ఆసుపత్రిని ఇటీవల శ్రీకాకుళంలో ప్రారంభించారు. ఆసుపత్రి ట్రస్ట్ మరియు సి.ఈ.ఓ   మణిమాల రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తు సహాకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు, జిల్లాలోని పేద ప్రజలు  ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందత్వ నివారణకు సహాయపడాలని కోరారు.

క్లినిక్ పనితీరులో కొత్త పుంతలు తొక్కడం ద్వారా మరియు కంటే సంవరక్షణ సేవల్లో రోగుల సంతృప్తిని సాధించడం ద్వారా ఈ ఆసుపత్రి సమాజంలో మంచి పేరు తెచ్చుకొంది. ప్రతి ఇంటికి వెళ్లి కంటి పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన వైద్య సేవలను ఉచితంగా అందించడం ద్వారా గ్రామాల్లో 85 శాతం ప్రజలకు కంటి సమస్యలు గుర్తించి వైద్యం అందించడం జరిగిందని మణిమాల పేర్కొన్నారు.

Related posts

కేశినేని నాని పోవడంతో ఊపిరి పీల్చుకున్న తెలుగుదేశం

Satyam NEWS

శ్రీకంఠ మహేశ్వర ఆలయానికి గోపుర శిఖరాన్ని బహుకరించిన దేశ్ ముఖ్ కుటుంబం.

Satyam NEWS

గోవిందా గోవింద: తిరుమల కొండపై వికటిస్తున్న కొత్త ప్రయోగాలు

Satyam NEWS

Leave a Comment