38.2 C
Hyderabad
April 29, 2024 21: 20 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రి సమస్యలపై వైద్య విధాన పరిషత్ కు వినతి

#areahospital

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో నెలకొని వున్న దీర్ఘకాలిక సమస్యలపై డిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమీషనర్ అజయ్ కుమార్ కి పత్రికా ముఖంగా గురువారం తెలిపారు. 24 గంటలు గైనకాలజిస్ట్ అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలని,హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో దూర ప్రాంతాల నుంచి  వారానికి సుమారు 100 నుండి 150 మంది గర్భిణీ స్త్రీలు పరీక్షలకు  వస్తున్నారని ఆయన తెలిపారు.

పరీక్షల అనంతరం స్కానింగ్ కొరకు ప్రయివేటు సెంటర్ లకు పంపుతున్నారని అన్నారు. కదలలేని స్థితిలో వున్న గర్భిణీ స్త్రీలు కోదాడ వెళ్ళి స్కానింగ్ పరీక్షలు పూర్తి చేసుకొని ఆసుపత్రికి వస్తే ఓపి సమయం అయిపోవడంతో మరో వారం రోజుల పాటు వేచి వుండాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన తెలిపారు. అంతే కాకుండా వేలాది రూపాయలు ఖర్చు చేయవలిసి వస్తుందని,గర్భిణీ స్త్రీలు రవాణాకు కూడా వేల రూపాయలు ఖర్చు చేయవలిసి వస్తుందని, ఆసుపత్రిలో 24 గంటలు గైనకాలజిస్ట్ అందుబాటులో వుండేలా చూడాలని కోరారు.

ప్రసవ సమయంలో ఆసుపత్రికి వస్తే డ్యూటీ లో వున్న నర్స్ లు,చిన్న చిన్న కారణాలతో సూర్యపేట జిల్లా ఆసుపత్రికి వెళ్ళమని సలహా ఇస్తున్నారని,లేదా ప్రయివేటు ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని అన్నారు.అదే విధంగా బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని కోరారు.

హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రి పరిధిలో 7 మండలాలు ఉన్నాయని,4 మండలాలలో సిమెంట్ ఫ్యాక్టరీలు,2 మున్సిపాలిటీలు,రైస్ మిల్లులు,  ఖర్మాగారాలు అధికంగా వుండటంతో ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర రక్తస్రావంతో ఎక్కువ మంది చనిపోతున్నారని,రెండు జిల్లాలకు సరిహద్దుగా వుండటంతో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర రక్తస్రావంతో చనిపోతున్నారని,తక్షణమే రక్తనిధి కేంద్రం ఏరియా ఆసుపత్రిలో  ఏర్పాటు చేయాలని అన్నారు.

ప్రభుత్వ దవాఖానాలో ల్యాబ్ ను ఆధునీకరించి,సిబ్బందిని పెంచాలని, వర్షాకాలం సీజనల్ లో  వచ్చే డెంగ్యూ, మలేరియా, ప్లేట్ లెట్ కణాల పరీక్షలకు ల్యాబ్ లో పరికరాలు,సెల్ కౌంటర్ మిషన్ లు లేకపోవడంతో  ప్రయివేటు ల్యాబ్ లలో వేల రూపాయలు చెల్లించి పరీక్షలు చేయుంచుకోవలసి వస్తుందని,వెంటనే వాటిని ఏర్పాటు చేసి సిబ్బందిని పెంచి అదనపు సమయం వుండేలా చూడాలని కోరారు.

దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని, సిబ్బంది కొరత ఉన్నప్పటికి  కొత్త వారిని నియమించటం లేదని,కానీ ఏరియా హాస్పిటల్ హుజూర్ నగర్ ఖాళీలు ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టులను జి.ఓ.నెం.1040 లో ఉన్న పోస్టులను మొత్తం నోటిఫికేషన్ లేకుండా అమ్ముకోవడం  జరిగిందని, వెంటనే వాళ్లపై చర్యలు తీసుకోవాలని, అర్హులైనా వాళ్ళకు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని,కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ నోటిఫికేషన్ వేసి రిక్రూట్మెంట్ చేసి దీర్గకాలంగా పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని కోరారు.

దవాఖానా ఆవరణలో మౌలిక వసుతులు  కల్పించాలి 

రోగి సహాయకులు, బంధువులు వేచివుండటానికి వసతి ఏర్పాటు చేయాలని,గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  లో 30 పడకల హాస్పిటల్ ని 100 పడకల హాస్పిటల్ చేయడం జరిగిందని,ఈనాటికి 7,8,సంవత్సరాల నుంచి ఇంత వరకు మరమతులు చేపట్టలేదని,వెంటనే మరమత్తులు చేపట్టాలని,కమీషనర్ తక్షణమే స్పందించి డెవలప్మెంట్ నిధులు అందించాలని దగ్గుపాటి బాబురావు పత్రికా ముఖంగా వైద్య విధాన పరిషత్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తిరుపతి నాయక్,పాశం నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

నందనవనం స్థానికులను ఖాళీ చేయమని బెదిరిస్తే ఊరుకునేది లేదు

Bhavani

మాజీ ఎమ్మెల్యే ఆమంచికి పాము కాటు

Bhavani

ఆదుకోని ప్రభుత్వం కారణంగా ప్రమాదంలో ప్రజారోగ్యం

Satyam NEWS

Leave a Comment