31.7 C
Hyderabad
May 2, 2024 09: 04 AM
Slider మహబూబ్ నగర్

చెంచుల అభివృద్ధికి పక్కాగా ప్రభుత్వ పథకాల అమలు

#L Sharman IAS

నల్లమలలోని నివసించే చెంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కృషి చేస్తానని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. లింగాల, అమ్రాబాద్‌ మండలాల పరిధిలోని అప్పాపూర్‌  చెంచు పెంటలను జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ శుక్రవారం సందర్శించారు. చెంచు పెంటలు అంగన్వాడి పాఠశాలను ఆయన పరిశీలించారు.

పాఠశాలకు వెళ్లే విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చెంచుల కోసం అమలు చేస్తున్న పథకాలు, ఐటీడీఏ ద్వారా కల్పిస్తున్న వసతులు, చెంచుల ఉపాధి, జీవన ప్రమాణాలను కలెక్టర్ చెంచులను అడిగి తెలుసుకున్నారు. అధికారుల సమక్షంలో ఆయన  చెంచులకు అందుతున్న ప్రభుత్వ పథకాలపై చర్చించారు.

ఈ సందర్భంగా చెంచులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 30 మంది రైతులకు బ్యాంకు అకౌంట్  నెంబర్లు లేవని ఆశా వర్కర్ మాత్రమే వస్తుందని ఏ ఎన్ ఎం రావడంలేదని, చెంచు పెంటలో నీటి సమస్య ఉందని, చెంచులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.

బ్యాంక్ అకౌంట్లు లేని చెంచు రైతులకు ఆయా గ్రామాల సర్పంచులు కార్యదర్శి బ్యాంకు అకౌంట్లను వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బోరు వేశామని వెంటనే కనెక్షన్లు అందజేస్తాం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కలెక్టర్ కు తెలిపారు. బోర్ వెంటనే ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

చెంచుల ఆరోగ్యంపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఐటిడిఎపీవో అఖిలేశ్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్ ప్రకాష్, అచ్చంపేట ఆర్డిఓ పాండు నాయక్ ఆర్డబ్ల్యూఎస్ డిఈ ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.

Related posts

అక్రమ నిర్మాణాలను తొలగించి దేవాలయ స్థలాన్ని పరిరక్షించాలి

Satyam NEWS

వి ఎస్ యూ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లకు జాతీయ స్థాయిలో ప్రశంసలు

Bhavani

చైనా లో తిరగబడ్డ జనవాహిని

Satyam NEWS

Leave a Comment