37.2 C
Hyderabad
April 26, 2024 20: 37 PM
Slider నెల్లూరు

వి ఎస్ యూ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లకు జాతీయ స్థాయిలో ప్రశంసలు

#VSUNSS

విక్రమ సింహపురి యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సెల్ తరపున పది మంది విద్యార్థులు 29 డిసెంబర్ 20 22 నుంచి 4 జనవరి 20 23 వరకు ఆది చుంచున గిరి యూనివర్సిటీ బేలూరు వారు నిర్వహించిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపులో పాల్గొన్నారు. ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపు లో 14 రాష్ట్రాలకు సంబంధించిన యూనివర్సిటీ విద్యార్ధులు పాల్గొన్నారు.

వి ఎస్ యూ విద్యార్థులు ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్లో సాంస్కృతిక పోటీలలో సోలో డాన్స్ విభాగంలో మొదటి స్థానాన్ని కుమారి ఏ .లావణ్య గెలుపొంది పలువురి ప్రశంసలను పొందారు అలానే గ్రూప్ డాన్స్ విభాగంలో విద్యార్ధులు శ్రీజ, లావణ్య నవ్య, కిరణ్మయి,నవీన్ పాల్గొని ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

అలానే గ్రూప్ సాంగ్ మరియు రంగవల్లి పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబరిచి పలువురి ప్రశంసలను పొందారు మరియు బెస్ట్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ గా సాయికుమార్, పృథ్వీరాజ్ అలానే ఉత్తమ వక్త గా ఆనంద్ ను ఆది చుంచున గిరి యూనివర్శిటీ ప్రోగ్రాం కో ర్డినేటర్ ప్రొఫెసరు ఎన్. రాము అభినందించారు. ఈ సందర్భంగా ఉపకులపతి జి.యం.

సుందరవల్లి విద్యార్థులు సాధించిన విజయాలను గురించి క్యాంప్ లో విద్యార్థులకు సహకారం అందించిన ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వై దివ్య ద్వారా క్యాంప్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఇలాంటి మరెన్నో విజయాలను సాధించి విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్. పి. రామచంద్రారెడ్డి, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి. విజయ ఆనంద బాబు, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కే .సునీత, డాక్టర్ కే.విద్యా ప్రభాకర్ పాల్గొని విద్యార్థులను అభినందించారు.

ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ NSSసెలక్షన్ కమిటీ ద్వారా డీకే ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి ఇద్దరు విద్యార్ధినులు, క్రిష్ణ చైతన్య డిగ్రీ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థులు మరియు యూనివర్సిటీ కళాశాల నుంచి 6 మంది విద్యార్థులు మొత్తం పదిమంది వాలంటీర్స్ సెలెక్ట్ చేసి పంపడం జరిగింది.

Related posts

పర్యావరణ పరిరక్షణ భావితరాలకు కానుక

Satyam NEWS

సిర్పూర్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి

Satyam NEWS

వాయుకాలుష్యంపై ఐదు రాష్ట్రాలకు రెడ్ ఎలర్ట్

Satyam NEWS

Leave a Comment