29.7 C
Hyderabad
April 29, 2024 10: 15 AM
Slider మహబూబ్ నగర్

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

#schools re openings

జిల్లాలో ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం గోవిందరాజులు పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా లో మన ఊరు మన బడి కి మొదటి విడతలో  35 శాతం పాఠశాలలను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.

అదేవిధంగా ఇంజనీరింగ్ శాఖలకు 290 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కు నిధుల అంచనా నివేదిక సమర్పించే జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. సర్కారు బడులలో 12 రకాల మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నట్లు ప్రకటించారు.

విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సం కల్పించిందని పోటీ ప్రపంచంలో నిలబడేలా విద్యార్థులను పాఠశాల స్థాయిలోనే విద్యార్థులను తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అదేవిధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం బోధనను ప్రవేశపెట్టడంతో పాటు సదుపాయాలను మెరుగుపరిచేందుకు మన ఊరు మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో 556 ప్రాథమిక పాఠశాలలు 128 ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 131 ఉన్నత పాఠశాలలో మొత్తంగా 825 ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయని అందులో మొదటి విడతగా రెండు వందల ప్రాథమిక పాఠశాలలో 45 ప్రాథమికోన్నత పాఠశాలలు 45 ఉన్నత పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో మొత్తం 35 శాతం 290 ప్రభుత్వ పాఠశాలను మనబడి ద్వారా ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

పాఠశాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఇంజనీరింగ్ అధికారులు అంచనా వ్యయంతో ఒక్కో పాఠశాలకు 30 లక్షల నుండి 200 కోట్ల వరకు వర్క్ ఆర్డర్ మంజూరు చేసే విధంగా జిల్లా కలెక్టర్ కు అధికారం ఉంటుందని పేర్కొన్నారు.

Related posts

స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది

Satyam NEWS

కోవిడ్ సమయంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సేవ అమోఘం

Satyam NEWS

Movie Up Date: విశాఖలో కోతి కొమ్మచ్చి

Satyam NEWS

Leave a Comment