38.2 C
Hyderabad
April 29, 2024 21: 48 PM
Slider నల్గొండ

ఇంటర్ సిలబస్ తగ్గింపు పేరుతో చరిత్ర తొలగించడం తగదు

#USFIStudents

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా బూచి చూపి ఇంటర్ మొదటి, రెండవ తరగతులలోని హిస్టరీ, పొలిటికల్ సైన్స్, అర్థ శాస్త్రం లోని టెక్స్ట్ బుక్స్ లలో చరిత్ర తొలగిస్తున్నారని యూఎస్ ఎఫ్ ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి  సయ్యద్ ఫయాజ్ అన్నారు.

విద్యార్థుల సామాజిక రాజకీయ చైతన్యానికి ప్రతీకలైన కారల్ మార్క్స్ ,రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, సామాజిక ఉద్యమకారులు మహాత్మ జ్యోతిరావు పూలే, రామస్వామి,సాహుజీ, నారాయణ గురు, చరిత్ర లతోపాటు కమ్యూనిజం, సోషలిజం బుద్ధిజం, గాంధీజం, తదితర పాఠాలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

దీనిని విద్యా అభిమానులు, మేధావులు, ప్రగతిశీల శక్తులు, ఖండించాలని ఫయాజ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. సామాజిక ఉద్యమాలకు చైతన్యానికి ఆదర్శాలకు నిలయమైన మేధావుల చరిత్రను సిలబస్ నుండి తొలగించడం వెనక కుట్ర ఉందని అన్నారు.

దీని మూలంగా విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయి అచేతనంగా యాంత్రికంగా తయారవుతారు అని అన్నారు వీరుల చరిత్రను కనుమరుగు చేయాలనే కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న చదరంగం లో టిఆర్ఎస్ ప్రభుత్వం పావుగా మారిందని అన్నారు.

వెంటనే వీరుల చరిత్రను తొలగించకుండా పునరుద్ధరించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కరోనా సమయంలో సమయం సరిపోదనే కారణంతో అసలైన చరిత్రను రద్దు చేయాలనే ఆలోచనను తెలంగాణ ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు.

దేశంలో విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం కాషాయికరణ విధానాలను మరింతగా తీసుకురావడంలో భాగంగానే ప్రగతిశీల, అభ్యుదయ, సామాజిక,ఉద్యమకారులు అటునవంటి డా.బి.ఆర్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, పెరియార్ రామస్వామి, నారాయణగురు, మార్క్సిజం, సోషలిజం, లాంటి అనేక చరిత్రలను రూపుమాపటంకోసం  ఈ ప్రయత్నం చేస్తున్నది.

దీని మూలంగా విద్యార్థులు నష్టపోతారని భావితరాలకు నూతన శక్తులను దేశ అభివృద్ధికి ఉపయోగపడే విద్యార్థులను తయారు చేయలేమని తెలిపారు.

Related posts

ఆత్మహత్యా యత్నం చేసుకోబోయిన తల్లి బిడ్డలు

Satyam NEWS

ఇంటర్ విద్యార్థిని మిస్సింగ్‌

Sub Editor

విద్యార్థుల ముందే డీఈఓ ను కడిగిపారేసిన ప్రవీణ్ ప్రకాష్

Satyam NEWS

Leave a Comment