25.7 C
Hyderabad
May 9, 2024 07: 45 AM
Slider ప్రత్యేకం

పరీక్షల సమయంలో విద్యార్థులు ధైర్యంగా ముందుకెళ్లాలి

#tamilsai

మానసిక ప్రశాంతతకు, నాణ్యమైన అధ్యయనానికి విశ్రాంతితో పాటు చదువును సాగించే ప్రయత్నం చేయడం చాలా ముఖ్యమని తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. విద్యార్థులు పరీక్షల సమయం లో మానసికంగా  దృఢంగా, ధైర్యంగా ఉండాలని ఆమె కోరారు. ఈరోజు రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన ప్రధానమంత్రి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పరీక్షా పే చర్చా 5వ ఎడిషన్‌లో ఆమె వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి వర్చువల్ గా పాల్గొన్నారు.

కార్యక్రమం అనంతరం గవర్నర్  విద్యార్థులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమం ప్రధానమంత్రి ద్వారా జరుగుతున్న ఒక మహత్తర కార్యక్రమమని, రాబోయే బోర్డు, ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు మానసికంగా ప్రశాంతంగా హాజరయ్యేలా చూడాలనే లక్ష్యంతో విద్యార్థులతో ప్రధాన మంత్రి సంభాషించారని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సమాజాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న ప్రయత్నాల వల్ల ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఏర్పడేలా పర్యావరణాన్ని సృష్టించడానికి ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అని ఆమె అన్నారు. విద్యార్థులతో మమేకమై ఆత్మవిశ్వాసాన్ని నింపినందుకు ప్రధానమంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు తమను తాము సిద్ధం చేసుకోవాలని తమిళిసై సౌందరరాజన్ విద్యార్థులకు ఉద్బోధించారు; విద్యార్థులు ప్రధాని సలహాలను పాటించాలని, భయాందోళనలకు దూరంగా ఉండి, పరీక్షలకు హాజరు కావాలని ఆమె కోరారు. ‘మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి తద్వారా మీరు పరీక్షలలో చదివినవన్నీ గుర్తుకు తెచ్చుకోగలుగుతారు’ అని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన దాదాపు 120 మంది విద్యార్థులు, రంగారెడ్డి జిల్లా నల్లగండ్ల జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన 10 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ రాజ్‌భవన్‌లో విద్యార్థులందరికీ ప్రధానమంత్రి  “ఎగ్జామ్ వారియర్స్‌” తెలుగు అనువాదాన్ని అందించారు. ఆ తర్వాత గవర్నర్ వర్చువల్ గా పుదుచ్చేరి రాజ్ నివాస్ విద్యార్థులతో సంభాషించారు. వారు కూడా ప్రధానమంత్రి ఇంటరాక్షన్ ప్రోగ్రాం పరీక్షా పే చర్చా 5వ ఎడిషన్‌లో పాల్గొన్నారు.

Related posts

రిషి సునక్ పై ఆశలు పెట్టుకోవడం అనవసరం

Satyam NEWS

విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ప్రశ్నపత్రాలను రూపొందించాలి

Satyam NEWS

ములుగు జిల్లాలో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

Satyam NEWS

Leave a Comment