37.2 C
Hyderabad
May 6, 2024 11: 27 AM
Slider ఖమ్మం

ధాన్యం సేకరణ సజావుగా జరగాలి

#Puvvada Ajay Kumar

జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న సేకరణ ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు ఐడిఓసి లోని సమావేశ మందిరంలో అధికారులు, మిల్లర్లు, లారీ ఓనర్స్ అసోసియేషన్, పిఏసీఎస్ చైర్మన్ లతో వారి ధాన్యం, మొక్క జొన్నల సేకరణ, రవాణా తదితర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగు కాగా దాదాపు 2లక్షల పై చిలుకు ధాన్యం సేకరణ కేంద్రాలకు వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు కేవలం 40 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరణ జరిగిందని అధికారుల లెక్కల ప్రకారం నమోదు అయిందన్నారు.

ధాన్యం సేకరణలో బాగా వెనుకబడి ఉన్నామని, ఇలాంటి పరిస్థితి జిల్లాలో ఎప్పుడూ లేదన్నారు. కొత్త కొత్త పాలసీలు జిల్లాలో మోపి రైతులను ఇబ్బందులు పెడితే సహించేది లేదని గుర్తుంచుకోవాలని హితువు పలికారు. మీకు ప్రభుత్వంతో ఉన్న సమస్యలను రైతులపై రుద్ది వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే అందుకు సమాధానం చెప్పాల్సి వస్తుందని మిల్లర్లకు తెలిపారు. కరోనా క్లిష్ట సమయంలోనే 3 లక్షల పై చిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఇప్పుడు దాన్ని అందుకోలేకపోవడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించారు.

మిల్లర్లు తరుగు పేరుతో 4 కిలోలు తీసేయడం సరికాదని దీన్ని మార్చుకోవాలని సూచించారు. ధాన్యం రవాణాలో అంతరాయం, అవాంతరాలు కలిగిస్తే వారి పై చర్యలకు వెనుకాడేది లేదని, ఇప్పటికైనా మీ పని తీరు మార్చుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం రైతు అనుకూల విధానాలు, రైతుబందు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, కాళేశ్వర జలాలతో పంట విస్థీర్ణం ఏటికేడు పెరుగుతూ రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరిస్తున్నామన్నారు.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా రైతు పండించిన చివరి గింజను మద్దతు ధరతో కొనాలన్న ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. తడిసిన ధాన్యాన్ని సేకరణ చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్త నివేదికల్లో ఓవైపు యావత్ ప్రపంచంలో 20ఏళ్ల కనిష్టానికి బియ్యం ఉత్పత్తి పడిపోతుంటే, కేవలం తెలంగాణలో మాత్రమే బియ్యం ఉత్పత్తి ఆరింతలు పెరిగిందన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత అని వెల్లడించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మండలానికి ఒక్కటి చొప్పున వెంటనే ప్రారంభించాలన్నారు.

సమీక్షలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, జిల్లాలో 236 ధాన్య సేకరణ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించి, 232 కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. 130 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించి, 4,220 మంది రైతుల నుండి 40477.520 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటి వరకు సేకరించినట్లు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని సేకరణకు 9 పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు ట్యాగ్ చేసినట్లు ఆయన అన్నారు.

జిల్లాలో 41 మొక్కజొన్న సేకరణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 31 పిఏసీఎస్, 10 డీసీఎంఎస్ ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన అన్నారు. గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రక్రియలో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ అన్నారు.

Related posts

మన ఊరు-మన బడి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

Satyam NEWS

కోవిడ్ నిబంధనలు పాటించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశం

Satyam NEWS

కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలి

Satyam NEWS

Leave a Comment