గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ గౌడ హాస్టల్ ప్రాంగణంలో గౌడ హాస్టల్ కార్యవర్గం, విద్యార్థులునేడు మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా హిమాయత్ నగర్ లోని వసతిగృహ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, ఉపాధ్యక్షులు పుల్లెంల రవీందర్ గౌడ్, జ్ఞానేశ్వర్ గౌడ్, జనరల్ సెక్రెటరీ చక్రవర్తి గౌడ్, ట్రెసరర్ శైలేజా గౌడ్, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పలువురు విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ వెలమ హాస్టల్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ కు, రెడ్డి హాస్టల్ ప్రెసిడెంట్ అమ్మా మేరీ, కురుమా హాస్టల్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేశారు.