33.7 C
Hyderabad
April 29, 2024 02: 57 AM
Slider ఖమ్మం

ఏ రోజు వచ్చిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆరోజే మిల్లులకు తరలించాలి

#V. P. Gautam

ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని, ఎరోజు వచ్చిన ధాన్యాన్ని ఆరోజునే కాంటా వేసి మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ బాధ్యులను ఆదేశించారు. కల్లూరు మండలం పేరువంచ, పుల్లయ్య బంజార ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోజువారి వచ్చే ధాన్యం వివరాలను, ట్యాబ్‌ ఎంట్రీ, మిల్లులకు తరలింపు వివరాల నమోదు రిజిస్ట్రర్‌లను కలెక్టర్‌ పరిశీలించారు.

ఈ సందర్భంగా ధాన్యం దిగుమతి, మిల్లింగును రామకృష్ణ మోడరన్‌, బిన్నీ రైస్‌ మిల్లులను కలెక్టర్‌ సందర్శించి మిల్లు బాధ్యులకు ధాన్యం వచ్చిన వెంటనే దిగుమతి చేసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, తరుగు తేమశాతం, కటింగ్‌ వంటి కారణాలు ప్రస్తావనే రావద్దని కలెక్టర్‌ అన్నారు. మిల్లింగ్‌ అయిన ధాన్యాన్ని గోదాములకు తరలించేంత వరకు పౌరసరఫరాల శాఖ అధికారులు, తహశీల్దార్లు పర్యవేక్షించాలన్నారు.

అనంతరం గత నెలలో ప్రారంభించుకొని క్రీడాకారులకు అందుబాటులోకి తెలిచ్చిన కల్లూరు మినిస్టేడియమ్‌ ను కలెక్టర్‌ సందర్శించి క్రీడాకారులు ఎంత మంది వస్తున్నది ఏఏ క్రీడలు నిర్వహిస్తున్నది అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేడియం నిర్వహణ, క్రీడకారులకు అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చి పరిచయం మంచి క్రీడాకారులను తయారు చేయాలని అధికారులకు తెలిపారు.

Related posts

భత్యాల తో పింఛన్, రేషన్ కార్డు బాధితుల గోడు

Satyam NEWS

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై ప్రమాణ స్వీకారం

Satyam NEWS

శాల్యూట్: సేవకు సై అంటున్న సైబరాబాద్ పోలీసులు

Satyam NEWS

Leave a Comment