38.2 C
Hyderabad
April 29, 2024 21: 54 PM
Slider ఆదిలాబాద్

5000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

#gudumba

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం ఈజ్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని మోసం గ్రామ శివారులో గుడుంబా తయారీ చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు శనివారం ఈస్గాం ఎస్సై జగదీష్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. మోసం గ్రామ శివారులోని గుబురు పొదలలో అక్రమంగా గుడుంబా తయారీకి సిద్ధంగా ఉన్న 5000 లీటర్ల బెల్లం పానకం, సామాగ్రి లభ్యం అయ్యింది. బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్టు ఎస్సై తెలిపారు. ఈ సోదాలలో ఏఎస్ఐ హీరామన్, హెడ్ కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుల్ నయీమ్, హోమ్ గార్డ్ లింగన్న లు పాల్గొన్నారు.

Related posts

చార్ ధామ్ యాత్ర: తెరుచుకున్న కేదార్ నాధ్ ఆలయం

Satyam NEWS

హుజుర్ నగర్ ఆటో వర్కర్స్ యూనియన్ ఎన్నిక

Satyam NEWS

గ్రామ కంఠం ఆక్రమించిన పెత్తందారుపై చర్యలేవి?

Satyam NEWS

Leave a Comment