34.2 C
Hyderabad
May 11, 2024 21: 59 PM
Slider ప్రత్యేకం

ఉత్త‌రాంధ్ర‌పై గులాబ్ తుపాను ప్ర‌భావం….!

#gulabtoofan

ఏపీ రాష్ట్రంలో కొద్దిగంట‌ల క్రితం ఏర్ప‌డిన గులాబ్ తుపాను ప్ర‌భావం…ఉత్త‌రాంధ్ర‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని విశాఖ  వాతావ‌ర‌ణ కేంద్రం పేర్కొంది. ఈ గులాబ్ తుపాను  కళింగపట్నం నుండి తూర్పు-ఈశాన్యంలో 50 కి.మీ., గోప్లాపూర్‌కు దక్షిణ ఆగ్నేయ  తీరానికి దగ్గరగా ఉందని  పేర్కొంది.

ఈ ప్ర‌భావంతో ఉత్తర , దక్షిణ కోస్తాతో పాటు ఒడిశాలో కొంత ప్రాంతంపై దీని ప్ర‌భావం తీవ్రంగా ఉంటుంది. ఈ తుపాను ప్ర‌భావంతో    గాలి తీవ్రత: 75 కిలోమీట‌ర్ల నుంచీ  95  కిలో మీట‌ర్ల  వరకు పెనుగాలులువీస్తాయ‌ని పేర్కొంది. తాజాగా ఈ గులాబ్  తుపాను….రానున్న మూడు గంట‌ల‌లో  కళింగపట్నం నుండి ఉత్తరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న  గోపాల్‌పూర్ మధ్య వ్యవస్థ తీరాలను దాటుతుందని…విజ‌య‌న‌గ‌రం జిల్లా రెవిన్యూ  అధికారి గ‌ణ‌ప‌తి రావు తెలిపారు.

తుపాను ప్ర‌భావంపై స‌త్యం న్యూస్.నెట్  ప్ర‌తినిధి ఈ రాత్రి ఏడుగంట‌ల ప్రాంతంలో  డీఆర్ ఓను  ఇంట‌ర్వ్వూ చేసింది. ఈ సంద‌ర్భంగా డీఆర్ ఓ మాట్లాడుతూ…ఈ అర్ద‌రాత్రి గులాబ్  తుపాను…గోపాల్ పూర్  తీరాన్ని దాటుతుంద‌ని..దీనిప్ర‌భావంతో ఈ అర్ధ‌రాత్రి విప‌రీతమైన పెను గాలులు వీస్తాయ‌ని తెలిపారు.

ఈ కారణంగా..27 ఉదయం వ‌ర‌కుఎవ్వ‌రూ ఇండ్ల‌నుంచీ బ‌య‌ట‌కు రావొద్ద‌ని హెచ్చరించారు. అలాగే..తుపాను దృష్ట్యా జిల్లాలో అన్ని స్కూళ్ల‌కు సెలవు ప్ర‌క‌టించామ‌ని తెలిపారు. ఇక తుపాను ప్రభావానికి తెగిపడే విద్యుత్ వైర్లను, విద్యుత్ స్తంభాలను, ట్రాన్స్​ఫార్మర్లను సరిచేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని, పరికరాలను, సిబ్బందిని అప్రమత్తంగా, అందుబాటులో ఉంచాలని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లకు సీఎండి ఆదేశాలిచ్చారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్

Related posts

స్థానిక సంస్థల గ్రాంటుగా తెలంగాణకు రూ.222 కోట్లు

Sub Editor

వెయింటింగ్ లో ఉన్న 35 మంది ఏఎస్పీల‌కు పోస్లింగ్ లు…!

Satyam NEWS

ఇంటర్నల్ వార్ :లండన్‌లో ముగ్గురు సిక్కుల హత్య

Satyam NEWS

Leave a Comment