37.2 C
Hyderabad
May 6, 2024 22: 40 PM
Slider నిజామాబాద్

జంగం సమాజ్ ఆధ్వర్యంలో గురు మార్గదర్శన మహోత్సవం

#gurumargadarsanam

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఈనెల 18న సోమవారం నాడు జరిగే గురుమార్గదర్శన, పాదపూజ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా జంగం సమాజం ప్రధాన కార్యదర్శి సంగాయప్ప,కామారెడ్డి జిల్లా అర్చక సంగం అధ్యక్షుడు అంజప్ప  పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ మూడు రాష్ట్రాల మహస్వాము లు హాజరవుతున్నారని మొత్తం 18 మఠాధిపతి లు వస్తున్నారన్నారు.

మన ప్రాంత బిచుకుందా లో జరగడం శుభ సూచికం అదృష్టంగా భావించాలి ఇంత పెద్ద కార్యక్రమంలో తమకు 18 మంది మఠాధిపతి లు వివిధ మహా స్వామీజీ లు ష ష బ్ర 108 మహా స్వాముల దర్శనం కావడం మహా భాగ్యం గా అనుకోవాలి.ఒకే వేదిక మీద మన ప్రాంతంలో వారి వారి జంగం అయ్యగారిలా ఇంటి గురు మాహారాజ్ లు వస్తున్నారు ఈ అవకాశం ను అందరం సద్వినియోగం చేసుకోవాలి ప్రత్యేకంగా ప్రతి జంగం సమాజ్ కుటుంబ సమేతంగా పిల్లలతో రావాలని కోరుతున్నాం.

మన ఆచార విచార జంగం అంటే ఎవరు మన విధి విధానాలు సమాజం లో జరిగే ప్రతి విషయం ను మనకు మహరాజ్ ల అమృత వాక్యాలు వినే భాగ్యం కల్పిస్తున్నాం. అలాగే వారి ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మద్నూర్, జుక్కల్, బిచ్కుంద,పిట్లం,నిజాంసాగర్,తో పాటు జిల్లా లోని అన్ని మండల ల కుటుంబీకులు, ఇతర జిల్లాల వారు కూడా అందరు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో పదవ తరగతి 10 కి 10 జిపిఏ సాధించిన పిల్లలకు సన్మానం, సంకృతిక కార్యక్రమాలు,భజన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అందరికి తెలియజేయలని మరి మరి కోరుతున్నాం. ఈ మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర జంగం సమాజ్ పెద్దలు, వక్తలు ఎన్నో తెలియని విషయాలు తెలుపుతారు. ఈ అవకాశం ను మనం సద్వినియోగం చేసుకొందామన్నారు. సంతోష్ అప్ప,మల్లికార్జున్ అప్ప, ప్రమోద్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

జి. లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

పోలీసులు పెట్రోలింగ్ విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

భాషా ‘మిత్ర’లాభం

Satyam NEWS

నేరాలకు శిక్షలు పడే విధంగా దర్యాప్తు సాగాలి

Satyam NEWS

Leave a Comment