27.7 C
Hyderabad
May 4, 2024 10: 35 AM
Slider విజయనగరం

కేంద్ర బ‌డ్జెట్ ను నిర‌సిస్తూ….ఈ నెల 10 న విజ‌య‌వాడ‌లో సద‌స్సు..!

#vijayanagaram

ద‌ళిత బ‌హుజ‌న శ్రామిక యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో….!

ఇటీవ‌ల కేంద్ర ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ పై ద‌ళిత బ‌హుజ‌న శ్రామిక యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో  ఈ నెల 10 న విజ‌య‌వాడ‌లో స‌ద‌స్సు నిర్వహిస్తున్న‌ట్టు   ద‌ళిత బ‌హుజ‌న శ్రామిక యూనియ‌న్ కార్య‌ద‌ర్శి చిట్టిబాబు తెలిపారు.ఈ మేర‌కు ఆయన మాట్లాడుతూ…ఇటీవ‌ల కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో ఆదీవాసిల‌కు మొండి చెయ్యనే మోడీ ప్ర‌భుత్వం చూపించింద‌ని విమ‌ర్శించారు.

ఈ సందర్భంగా దళిత ఆదివాసీ బడ్జెట్ అనాలిసిస్ నివేదికను విడుద‌ల చేసిన ఆయ‌న కేంద్ర బడ్జెట్ లో దళిత ఆదివాసీలకు మొండి చేయి చూపారని అన్నారు. జనాభా నిష్పత్తి  ప్రాతిపదికన నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. ఎస్సిలకు .1,82,976 కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం 1,42,342  కోట్లు మాత్రమే కేటాయించడం,ఎస్టీలకు 98,664 కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం 89,265 కోట్లు మాత్రమే కేటాయింటం ద్వారా చాలా అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం గడ‌చిన ఐదేళ్లలో జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించక పోవడం వలన 9,89,315 కోట్లు దళిత, ఆదివాసీలు నష్టపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.దేశంలో ఎస్సీ,ఎస్టీ లపై దాడులు పెరుగుతున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదికలు తెలుపుతున్నా, ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలుకు .6000 కోట్లు మాత్రమే కేటాయించడం,  పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్స్ .5,600 కోట్లయి నిధులు కేటాయించడం కంటి తుడుపు చర్యమాత్రమేన‌ని అన్నారు..

ఈ బడ్జెట్ లోఎస్సీ,ఎస్టీ అభివృద్దకి ఒక్క కొత్త పధకాన్ని కూడా ప్రవేశ పెట్టలేదని…దళిత ఆదివాసీ ల ఆకాంక్షల్ని పరిగణలోకి తీసుకోకపోవడం దళిత,ఆదివాసీల పై సవతి తల్లి ప్రేమచూపిస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి, లోపాలు సవరించి రివైజ్డ్ బడ్జెట్ లో నిధుల కేటాయింపు లు పెంచాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం లో దళిత ఆర్థిక అధికార ఆందోళన్  ప్రతినిధి బొంగ భానుమూర్తి, రైల్వే ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం పట్నాల బంగార్రాజు, డి.బి.ఎస్.యు జిల్లా కార్యదర్శి రాయి ఈశ్వరరావు, దళిత బహుజన స్టూడెంట్స్ యూనియన్ నాయకులు గుజ్జల లావణ్య, శివ ప్రసాద్, డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కోఆర్డినేటర్ కె వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్పెషల్: టీటీడీ ఈవోగా జె ఎస్ వి ప్రసాద్ కు గ్రీన్ సిగ్నల్?

Satyam NEWS

ఉత్ప‌త్తి ఆధారంగా ధాన్యం, బియ్యం సేక‌రించ‌లేం

Sub Editor 2

ఈ నరరూప రాక్షసులకు హ్యూమన్ రైట్స్ ఎందుకు?

Satyam NEWS

Leave a Comment