37.2 C
Hyderabad
May 6, 2024 15: 02 PM
Slider నల్గొండ

నాటిన ప్రతి మొక్కను అందరూ సంరక్షించాలి

#Harita Haram

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అన్నారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని వారు పిలుపునిచ్చారు.

 సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం 6 విడత  హరితహారం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పర్యవేక్షణలో పట్టణంలోని నాలుగో వార్డ్ లో కౌన్సిలర్ ఓరుగంటి రాజ్యలక్ష్మి నాగేశ్వరరావు మొక్కలు నాటారు.

నాటిన మొక్కలకు సపోర్టుగా కర్రలను ఏర్పాట్లు చేసి ఆ స్థలం చుట్టూ పెన్సింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రతి ఇంట్లో ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడవలసినదిగా కోరారు. వార్డ్ లో పలుప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్ అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, కమిషనర్ నాగిరెడ్డి  మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మర్ల శ్రీనివాస్ యాదవ్,నర్సింగ్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు D మంగమ్మ  వీరారెడ్డి,కుంట ఉపేంద్ర సైదులు,భాస్కర్,యరగాని  గురవయ్య ,గాబుల శ్రీను ,కొమ్ము శ్రీను ,సతీష్,ఆంజనేయులు , సంపత్ , వెంకన్న , సత్యనారాయణ , వెంకట రెడ్డి , రాజశేఖర్,మున్సిపాలిటీ సిబ్బంది, ఆర్ పి లు,సి ఆర్ పి లు, మెప్మా సిబ్బంది, వార్డు పౌరులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ

Satyam NEWS

ఈ సారి కూడా ప్రధానికి మొహం చాటేస్తున్న సీఎం కేసీఆర్

Satyam NEWS

కొన్న భూములు కాపాడుకోవటం కోసం…

Satyam NEWS

Leave a Comment