37.2 C
Hyderabad
May 2, 2024 12: 21 PM
Slider ముఖ్యంశాలు

Good Bye: ముద్రగడ పద్మనాభం లేఖ పూర్తి పాఠం

#Mudragada Padmanabham

ఈ మధ్య పెద్దవారు చాలా మంది మన సోదరుల చేత నేను మానసికంగా కృంగిపోయే విధంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాడులు చేయిస్తున్నారు. ఈ విధంగా వారు దాడుల చేయవలసిన అవసరం ఎందుకు ఎంచుకున్నారో నాకైతే అర్ధం కాలేదు.

ఉద్యమం చేసిన కాలంలో నేను వసూలు చేసిన నిధులు గానీ పారిశ్రామిక వర్గాలను బెదిరించి సంపాదించిన డబ్బులుగానీ, అప్పటి ముఖ్యమంత్రిగారు, ఇప్పటి ముఖ్యమంత్రిగారి వద్ద లొంగిపోయి మూటలతో కోట్లాది రూపాయలు, నన్ను నిత్యం విమర్శించే మన సోదరులకు పంలేదనా ఈ దాడికి కారణం?

నేను ఆ రోజు ఉద్యమంలోకి రావడానికి ముఖ్య కారణం చంద్రబాబునాయుడు గారే. మన జాతికి బిసి రిజర్వేషన్ ఇస్తాను అని ఇచ్చిన హామీ కోసం అన్న సంగతి మీకు తెలియదని కాదు. ఈ ఉద్యమం ద్వారా డబ్బు గానీ పదవులు గానీ పొందాలను ఏనాడూ అనుకోలేదు.

ఉద్యమంలో ఆర్ధికంగా ఆరోగ్య పరంగా నష్టపోయా

ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఆర్ధికంగానూ ఆరోగ్య పరంగానూ చాలా నష్టపోయాను. రాజకీయంగా ఎంత నష్టపోయానో మీ అందరికి తెలుసు. కానీ ఏ నష్టానికి ఎప్పుడూ చింతించలేదు. తుని సభ, పాదయాత్ర ఘనంగా జరగడానికి కారణం నా గొప్ప కాదూ… కాదు. అది చాలా మంచిగా జరగడానికి కారణం జాతి ఆకలి అన్న సంగతి గమనించండి.

నా రాజకీయ జీవితంలో ఎన్నో పార్టీలు, కుల సభలు చూసాను. విన్నాను. ఏ సభకైనా చెప్పిన సమయానికి ప్రజలు రెండుగంటలు ఆలస్యంగా చేరే అలవాటు ఉన్న సంగతి లోకానికి తెలుసు. కానీ ఈ సభకు రెండు గంటలు ఆలస్యంగా రావడం కాదు. వేల మంది రెండు రోజుల ముందే చేరుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇది మరువలేని అనుభూతి.

ఒకరు ఫోన్ చేసి మీ కష్టం ద్వారా వచ్చే ఫలితాన్ని ఇతరు కొట్టేసేలాగున్నారు కాబట్టి ఇతరులు ఇచ్చన స్టేట్ మెంట్ కు సపోర్టు చేస్తూ మేరు నడిచేయండి అని సలహా ఇచ్చారు. ఎందుకు వారితో నడవాలి. ఆనాడు ఈ ఉద్యమం వెనకాల వారందరూ నడిచారా వారు నడవనప్పుడు నేను నడవవలసిన అవసరం లేదు.

ఎవరి ద్వారా అయినా రిజర్వేషన్ రానివ్వండి దానికి అందరూ సంతోషపడదాం అని చెప్పడం జరిగింది. ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూ రిజర్వేషన్ ఇచ్చేయడం వల్ల నేను గొప్పవాడిని అయిపోతాను అని మీరు అభిప్రాయపడవచ్చు.

ఫలితాన్ని ఆశించి చేసేవాడిని నేను కాదు

దయచేసి మీ ఆఫీసులో పని చేసే వారి పేరు మీద లేఖ తీసుకుని పని చేసి ఆ పేరు ప్రతిష్టలు మీరే పొందండి ఫలితాన్ని ఆశించే మనిషిని కాదు అని ఆనాడే చెప్పడం జరిగింది. ఈ రిజర్వేషన్ అంశంపై ఎందరో మేధావులతో అడ్వకేట్స్ తో తరచూ సలహా చేసినప్పుడు ఎన్నో రకాల అభిప్రాయాలు చెప్పేవారు. నేనైతే పెద్దగా చదువుకోలేదు, మేధావిని అంతకంటే కాదు.

వారి వారి సలహాలు మేరకు రిజర్వేషన్ విషయాలలో వారి సూచనలు పాటించేవాడిని. రిజర్వేషన్ సాధన కోసం ఉద్యమం గురించి జె ఎ సి తో తరచూ చర్చించేవాడిని. కొన్ని విషయాలలో జె కె సి కూడా విభేదించేది. ప్రభుత్వం బైకు ర్యాలీ పాదయాత్ర అడ్డుపడిన తర్వాత ఒక రోజైనా పాదయాత్ర బైక్ ర్యలీ చేయాలని నేనే సొంతంగా నిర్ణయం తీసుకున్నాను.

మొన్న అలాగ, నిన్న ఇలాగ, ఈ రోజు మరొక లాగ అంటున్నావు అంటున్నారు. బంతిని తెలివిగా కేంద్రం కోర్టులో వేసాననడం కూడా బాధిస్తుంది. ఉద్యమంలో పరిస్థితిని బట్టి మెరుగైన ఫలితాల సాధన కోసం రకరకాల ఆలోచనలతో ముందుకు వెళతాము. ఒకే ఆలోచనతో ఎప్పూ ఏ ఉద్యమం ముందుకు వెళ్లదు.

ఉదాహరణకు కారులో ప్రయాణం చేస్తాం. ఒక్కోసారి ఏదో కారణం చేత దారి మూసి ఉండవచ్చు. అటువంటప్పుడు గమ్యం చేరడానికి వేరు వేరు దార్లు తెలుసుకుని ప్రయాణం చేస్తాము. అలాగే ఉద్యమ కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఏదో విధంగా జాతికి మంచి జరగాలి అన్నదాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం.

ఎవరిది దానం ఎవరు తీసుకుంటారు?

ఆ ప్రయత్నాలు కూడా తప్పు అనడం అనేది న్యాయంగా లేదు. ఒకరు దానం అనే పదం నేరు రాయడం తప్పు అంట, మరొక ఆయన అవకాశ వాదుల్లా మాట మార్చొద్దని సలహా ఇస్తున్నారు, ఒకాయన టివి చర్చల్లో ఇంచుమించుగా కుల ద్రోహి, గజ దొంగ రకరకాల పదాలతో మాట్లాడారంట, మరొక ఆయన గతంలో ఒంటి కాలితే లేచేవాడు ఇప్పుడు కాళ్లు పడిపోయాయా అని రకరకాల పోస్టింగులు పెడుతున్నారు.

రండి నాపై విమర్శలు చేసే వారే డ్రైవింగ్ చేయండి

ఇవన్నీ చూసి కలత చెంది ఉద్యమం నుంచి పక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఉద్యమం ద్వారా నేనేమి సాధించలేదని రోజూ పేరు చెప్పకుండా పది మందితో తిట్టిస్తూ నేను తరచూ రోడ్డు మీదరకువచ్చి అరవలేదని ఫలాలు సాధనలో సరిగా నడవలేదని చెప్పించే వారిని వారే డ్రైవర్ సీటులో కూర్చుని జాతికి నేను తీసుకురాలేని బిసి రిజర్వేషన్ వచ్చే ఏర్పాటు చేయమని మడుగులో ఉండి ఇతరుల చేత నన్ను తిట్టించే వారిని కోరుకుంటున్నాను.

సెలవు. ముద్రగుడ పద్మనాభం. నా కులం తెలగ.

Related posts

కనకంబొట్ల వేంకటేశ్వర శర్మ కు ఘన నివాళులు

Satyam NEWS

అఖిల పక్ష సమావేశానికి ఏపి సిపిఐ డిమాండ్

Satyam NEWS

విశాఖపట్నం తరలివెళ్లే ముహూర్తానికి మళ్లీ బ్రేక్

Satyam NEWS

Leave a Comment