35.2 C
Hyderabad
May 1, 2024 00: 10 AM
Slider ఆంధ్రప్రదేశ్

అత్యవసర పరిస్థితిలలో ఫోన్ చేయండి

Srikanth Reddy-3

నివర్ తుపాను పట్ల నియోజక వర్గ వ్యాప్తంగా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి మున్సిపల్ కార్యాలయం నందు బుధవారం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామ‌న్నారు.

నేడు, రేపు జాగ్ర‌త్త‌గా ఉండాలి

బుధవారం అర్ధరాత్రి, గురువారం తెల్లవారు జామున 3 గంటల వరకూ అధికారులకు 5 ఫోన్ కాల్స్ వచ్చాయని, అధికారులు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తూ సమస్యలును పరిష్కరిస్తూ, ముందస్తు చర్యలు చేపట్టారన్నారు. దెబ్బతిన్నఇళ్లలో ప్రజలు నివాసాలు వుండొద్దని ఆయన సూచించారు. బుధవారం నుంచి సంబేపల్లె లో 145 ఎంఎం వర్షపాతం, రాయచోటి పట్టణంలో 85 ఎంఎం వర్షపాతం నమోదయిందన్నారు. నేడు, రేపు వర్షం ఉంటుందని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.

అద‌న‌పు కార్మికుల ఏర్పాటు

గురువారం నాడు కార్మికుల సమ్మె జరుగుతున్ననేపథ్యంలో కార్మికులు విధులకు హాజరు కాకపోయినా మున్సిపల్ అధికారులు, సచివాలయ వాలంటీర్లు బయట నుంచి అదనపు కార్మికులను ఏర్పాటు చేసుకుని సమస్యలు లేకుండా కృషి చేస్తున్నారన్నారు. నియోజక వర్గ పరిధిలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ, ఏ ఓ లు, సిబ్బంది పంటల పరిశీలనలో ఉండాలని ఆదేశించామ‌న్నారు.
\

రైతుల‌కు స‌హాయంగా ఉంటాం

చేతికొచ్చిన ధాన్యం ఈ వర్షానికి పాడవడం బాధాకరమన్నారు. రైతులకు సాయంగా ఉంటామన్నారు. వర్షాలతో పట్టణంలో ఉత్పన్నమయ్యే సమస్యలును ఎదుర్కొని వీలైనంతవరకు సమస్యలు లేకుండా చేస్తామన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ఏ సమయంలో నైనా ఈ కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేయాలని, ప్రజారోగ్యశాఖ 08561-251525&
9866200722 నెంబర్లకు ఫోన్ చేయాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. అధికంగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, కుంటలు ఎక్కడైనా దెబ్బతిన్నా తక్షణమే సచివాలయ, రెవెన్యూ అధికారులకు తెలియపరచాలన్నారు.

అత్యవసర సమయాలలో తన ఫోన్ నెంబర్ 9866504367కు శ్రీకాంత్ రెడ్డి సూచించారు.

Related posts

పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధికి కృషి

Satyam NEWS

వెల్ కం: ప్లాస్టిక్ రహిత గ్రీన్ ఫుడ్ జోన్ ప్రారంభం

Satyam NEWS

చింతలపూడి టీడీపీ అభ్యర్ధిపై విస్తృత చర్చ

Satyam NEWS

Leave a Comment