40.2 C
Hyderabad
April 26, 2024 13: 52 PM
Slider హైదరాబాద్

వెల్ కం: ప్లాస్టిక్ రహిత గ్రీన్ ఫుడ్ జోన్ ప్రారంభం

green food zone

హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం, మాదాపూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రహిత గ్రీన్ ఫుడ్ జోన్ ను గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేడు ప్రారంభించారు. శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరేకపూడి గాంధీ, మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ, రోడ్ల వెంట ఉండే వ్యాపారులకు, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలఎత్తకుండా 50 స్టాళ్లతో ఒక ప్లాస్టిక్ ఫ్రీ రహిత ఫుడ్ వెండర్ స్ట్రీట్ ను ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రజలకు రుచికరమైన, ఆరోగ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా, చిరు వ్యాపారులకు ఎఫ్.ఎఫ్.ఎస్.ఏ.ఐ లో ట్రైనింగ్ అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జి.హెచ్.ఎం.సి అధికారులు ఈ చిన్న రెడ్డి, డి.ఈ రూప దేవి, డి.ఈ బాలమురళి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రవి, ఏ.ఈ ప్రశాంత్ పాల్గొన్నారు.

ఇంకా నాయకులు జయరాజ్ యాదవ్,భి క్షపతి ముదిరాజ్, శ్రీనివాస్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, హున్య నాయక్, వార్డ్ సభ్యులు రహీం, శ్రీనివాస్, రామచందర్, పితాని శ్రీనివాస్, జంగయ్య యాదవ్, సాంబశివరావు, ఖాసీం, బ్రమయ్య యాదవ్, సాంబయ్య, బాబూమియా, సాదిక్, నూరుద్దీన్, లోకేష్, కృష్ణతైలి, రెహ్మాన్, ముఖ్తర్, ఆచుత్, అజీమ్ఉల్లాహ్ ఖాన్, ఖాజా, రాందాస్, రామాంజనేయులు, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Related posts

వర్గల్ సిద్ధాంతి ని పరామర్శించిన మంత్రి హరీష్ రావు

Satyam NEWS

Atrocious: ఏపీలో మరో శిరోముండనం కేసు

Satyam NEWS

ఆశ లావు పీక సన్నం: విఫలమైన ‘జాతీయ స్వప్నం’

Bhavani

Leave a Comment