కళాశాల నుండి ఇంటికి వెళ్తున్న అమ్మాయిలను వేధిస్తున్న వ్యక్తి పోలీసు చరలో చిక్కాడు. గోదావరి ఖనిలో ఈ సంఘటన జరిగింది. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ లైన్ నుండి డయల్ 100 కి కాల్ చేసి ఒక అబ్బాయి కాలేజీ నుంచి వస్తూ ఇంటికి వెళ్తున్న అమ్మాయిలను వేధిస్తున్నాడని చెప్పారు.
ఫోన్ అందుకున్న కంట్రోల్ రూమ్ వారు గోదావరిఖని 1టౌన్ సీఐ పి. రమేష్ కి పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. వన్ టౌన్ సిఐ బ్లూ క్లోట్స్, పెట్రోల్ కారు సిబ్బందిని అలర్ట్ చేయడం తో సిబ్బంది ఫోన్ చేసిన స్థలం వద్దు వెళ్లారు. అక్కడ యనమదల దుర్గాప్రసాద్ గౌడ్ అనే వాడు దొరికాడు. విఠల్ నగర్ కు చెందిన ఇతడిని పట్టుకుని గోదావరిఖని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి అరెస్టు చేశారు.