42.2 C
Hyderabad
May 3, 2024 18: 18 PM
Slider నెల్లూరు

జర్నలిస్టుల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తా

nellore journalists

జర్నలిస్టుల వృత్తి పవిత్ర మైనదని  నెల్లూరు గ్రామీణ వైసీపీ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పరిషత్ నూతన సమావేశ మందిరంలో సీనియర్ జర్నలిస్ట్ ఆకుల పురుషోత్తం బాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఏపీ జె ఎఫ్ జిల్లా మహాసభ జరిగింది.

ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులపై తమకు ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. వైసిపి యువనేత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని అన్నారు.

వృత్తి  నిబద్ధతతో పనిచేసే జర్నలిస్టుల కు సమాజంలో ఎల్లప్పుడూ గుర్తింపు గౌరవం ఉంటాయన్నారు.  సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ముమ్మడి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో కొందరు జర్నలిజానికి మచ్చ తెచ్చేవిధంగా వ్యవహరిస్తున్నారని దీనివల్ల ప్రజాస్వామ్యంలో జర్నలిజం మీద ఒకరకమైన దురభిప్రాయం నెలకొందన్నారు.

జర్నలిజంలో నైతిక విలువలు కాపాడుకోవడం ద్వారా వృత్తి నిబద్ధతతో పని చేసినప్పుడే సమాజంలో జర్నలిస్టులకు గౌరవం ఉంటుంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర సీనియర్ కార్యదర్శి కృపావరం మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల సమస్యల కోసం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఎనలేని కృషి చేసిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా ఇంచార్జ్ శ్రీరామ్ యాదవ్, ప్రముఖ ఆధ్యాత్మిక హిందూ మత ప్రచార సమితి అధ్యక్షులు డాక్టర్ కోట సునీల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర నాయకులు వల్లూరు ప్రసాద్ కుమార్, జాబ్ జిల్లా నాయకులు ద్వారం వేణుగోపాల్ రెడ్డి, కమతం గోపీనాథ్, వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం, జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఆకుల పురుషోత్తం బాబు, (సింహపురి బాబు) జిల్లా అధ్యక్షుడిగా శాఖమూరు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా మల్లు రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులుగా సుబ్బు సింగ్, ఓరేపల్లి వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ జిల్లా కార్యదర్శిగా నన్నూరు శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీగా మూర్తి, కోశాధికారిగా మల్లికార్జున్ లతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

Related posts

గొల్లపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి కి ప్రత్యేక పూజలు

Satyam NEWS

అక్రమ మద్యం రవాణాను అరికట్టాలి

Bhavani

ఎన్నికల జాతరను తలపిస్తున్న రాజకీయ డ్రామాలు

Satyam NEWS

Leave a Comment