31.7 C
Hyderabad
May 2, 2024 07: 41 AM
Slider ముఖ్యంశాలు

వ్యతిరేక తీర్పులు వస్తున్న నేపథ్యంలో…ఇలా..

#Y S Jagan

ఉరిమి ఉరిమి అక్కడెక్కడో పడ్డట్టు ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు వస్తున్న కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ న్యాయవాదులను రాజీనామాలు చేయిస్తున్నది. హైకోర్టులో వరుసగా వ్యతిరేక తీర్పులు వస్తున్న అంశంపై మల్లగుల్లాలు పడుతున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చివరకు ప్రభుత్వ న్యాయవాదులు సరిగా పని చేయకపోవడం వల్లే ఇలా జరుగుతున్నది అనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తున్నది.

మొత్తం ఏడుగురు పిపిలను రాజీనామా చేయాలని ప్రభుత్వం కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఏడుగురిలో ముగ్గురు తాజాగా రాజీనామాలు సమర్పించారు. నేడు రాజీనామాలు సమర్పించిన వారిలో పెనుమాక వెంకట్రావు, గెడ్డం సతీష్ బాబు, హబీబ్ షేక్ ఉన్నారు. మరో నలుగురు రాజీనామాలు సమర్పించాల్సి ఉంది.

ఈ ముగ్గురి రాజీనామా పత్రాలను ప్రభుత్వం తక్షణమే ఆమోదించింది. వీరంతా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియమితులైన వారు.

Related posts

నవంబర్ 12 నుంచి బాలోత్సవ్

Murali Krishna

వి ఎస్ యూ లో ఆడియో వీడియో విజువల్ సెంటర్ ప్రారంభం

Bhavani

విశాఖ రేంజ్ డీఐజీ కళ్ల ముందే నిబంధనల ఉల్లంఘన…!

Satyam NEWS

Leave a Comment