40.2 C
Hyderabad
April 26, 2024 13: 51 PM
Slider మహబూబ్ నగర్

46 జీవోను అమలు చేయని విద్యాసంస్థలపై చర్య తీసుకోవాలి

#PDSU

46 జీవోను అమలు చేయని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పిడిఎస్ యు నారాయణ పేట జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, జిల్లా కార్యదర్శి అజయ్ డిమాండ్ చేశారు.

నేడు నారాయణపేట మండల విద్య అధికారి గోపాల్ నాయక్ కు పిడిఎస్ యు ఆధ్వర్యంలో ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా తమ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు వసూలు చేస్తున్నాయని అన్నారు.

కరోనా వైరస్ కష్టకాలంలో తమ ఇష్టానుసారంగా, ఫీజులు వసూలు చేయవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 46 ను విడుదల చేసిందని అయితే నారాయణపేట మండలంలోని కార్పొరేట్ పాఠశాలలు ఈ జీవోను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు.

జీవో నెంబర్ 46 ను పకడ్బందీగా అమలు చేయాలని, అమలు చేయని పాఠశాలలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా కోశాధికారి గౌస్, నాయకులు మారుతి, సాయి తదితరులు పాల్గొన్నారు.

Related posts

మన్యం వీరుడు అల్లూరి జయంతి….రహదారిపై తిరుగాడిన జాతీయ పతాకం…!

Satyam NEWS

ఓ గాడ్: భార్యను హత్య చేసిన సీఆర్ పిఎఫ్ జవాను

Satyam NEWS

వేసవి లో కూరగాయల సాగు అనుకూలం

Bhavani

Leave a Comment