32.2 C
Hyderabad
May 1, 2024 23: 43 PM
Slider విశాఖపట్నం

కరోనా విజృంభిస్తున్న వేళ ఉపయోగపడే హెల్త్ పాలసీ

#voralmedicine

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సందర్భంగా ప్రైవేటు హాస్పిటల్స్ లో కరోనా చికిత్స నిమిత్తం అయ్యే ఖర్చులు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు  పెను భారంగా మారింది. అందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భీమా (ఇన్సూరెన్స్) కంపెనీ వారు కరోనా కవచ్ ఇన్సూరెన్స్ ప్రవేశ పెట్టారని మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తెలిపారు.

వివరాలు

కరోనా కవచ్: భీమా ఎవరైనా  తీసుకోవచ్చు ఈ భీమా కాలపరిమితి 1. మూడున్నర  నెలలు, 2.ఆరున్నర నెలలు, 3. తొమ్మిదిన్నర నెలలు మనం తీసుకునే ప్రీమియం బట్టి కాలపరిమితి వుంటుంది. కరోనా  కవచ్ లో 50 వేల నుండి  5 లక్షల వరకు బీమా ఉంటుంది.

పుట్టిన ఒక రోజు బిడ్డ నుండి 65 సంవత్సరాల వరకు  ఈ బీమా తీసుకోవచ్చు. ఈ భీమా చేసుకున్నా వారు ఆసుపత్రిలో  చేరి  చికిత్స  పొందుతున్నప్పుడు,  ఎలాంటి  మినహాయింపులు  లేకుండా  పాలసీ కి అనుగుణంగా అన్ని  రకాల ఫీజులు,  ఖర్చులు  కు  పరిహారం  హాస్పిటల్ కి నేరుగా ఇస్తుంది.  

ఈ బీమా కుటుంబ సభ్యులు అందరూ కలిపి  కూడా  తీసుకోవచ్చు. ఈ బీమా తీసుకున్న 15 రోజుల తర్వాత వర్తిస్తుంది. ఈ బీమా పై సందేహం ఉంటే ఈ ఫోన్ నంబర్ ని సంప్రదించండి. రవి, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, సెల్: 9010875333.

చాలామంది ఇదివరకు చేయించుకున్న హెల్త్  భీమా పాలసీలు కింద కరోనా చికిత్సకు కవర్ అవుతుందని అనుకుంటున్నారు కానీ కేవలం రూమ్ ఛార్జీలు,మందులు మాత్రమే ఇవ్వగలరు మరి ఇతర పి.పి.ఈ కిట్లు,  చికిత్స కొరకు సంబంధించిన ఖర్చులు లభించకపోవచ్చు.

ఈ సూచన మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆదేశాలు మేరకు  ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు అవగాహన కోసం తెలియచేస్తున్నాము తప్ప ఇది ప్రమోషన్ గురించి గాని పబ్లిసిటీ గురించి గాని కాదు అని తెలియజేస్తున్నాము.

మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, పి.ఏ వికాస్, సెల్ 9110706029

Related posts

వైసీపీ గెలుపుకు కారణమైన రెండు సంఘటనలే ఈసారి శాపం

Satyam NEWS

తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్. లో హన్సిన ఫస్ట్ లుక్

Satyam NEWS

పేద ప్రజలకు అండగా ఉండేది టీఆర్ఎస్ ప్రభుత్వమే

Satyam NEWS

Leave a Comment