40.2 C
Hyderabad
May 2, 2024 18: 59 PM
Slider నిజామాబాద్

Safety Tips: ఎక్కడికీ వెళ్లవద్దు ఇంట్లోనే ఉండండి

#Health camp

రాజధాని హైదరాబాద్ కు, మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలకు అలాగే పక్క జిల్లాలకు, దూర ప్రాంతాలకు ప్రయాణాలను స్వచ్ఛందంగా రద్దు చేసుకోవాలని వైద్య బృందం కోరుతున్నది. కరోనా వ్యాప్తి నిరోధించడంలో భాగంగా బిచ్కుంద మండలంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని, B తండా, రాజుల్లా గ్రామాన్ని వైద్య బృందం నేడు పరిశీలించింది.

I E C ఆక్టివిటీ లో భాగంగా వివిధ ప్రాంతాలలో  కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిన వారిని ఇంటి వద్దకే వెళ్లి వారిని కలుస్తూ యోగక్షేమాలు పరిశీలిస్తున్నారు. ముఖ్యముగా బిచ్కుంద మండలంలోని ప్రధాన విధుల గుండా తిరుగుతూ వారు కరోనాపై విస్తృత మైన ప్రచారం చేస్తున్నారు.

కరప్రతులను పంచుతూ అవగాహన  కల్పిస్తూ, తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు, నివారణ చర్యలు అలాగే  ఆరోగ్య విద్యను బోధిస్తున్నారు. పాజిటివ్ కేస్ లను కలసి జ్వరం, తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలు, ఛాతి నొప్పితో బాధపడడం మొదలగు  లక్షణాలపై ప్రతి రోజు ఆరా తీస్తు, వారి ఆరోగ్య పరిస్థితుల పై అంచనా వేస్తారు. 17 రోజు ల హోమ్ ఐసోలేషన్ కాలం వారికి కావాల్సిన మాత్రలు ఇస్తారు.

ఖచ్చితమైన నియమ నిబంధనలను పాటించాలని వారు చెబుతున్నారు. ఇంటి నుండి బయటకు రాకూడదు, తప్పని సరిగా మాస్క్ ధరించాలని వారికి చెబుతున్నరు. తరచు చేతులను శుభ్రంగా కడుక్కొవాలని, సామాజిక దూరం పాటించాలని, అలాగే వ్యక్తి గత పరిశుభ్రత పాటిచాలని చెబుతున్నారు.

ఈ కార్యక్రమంలో  డాక్టర్ మమత, డాక్టర్ విక్రమ్, ఆరోగ్య బోధకుడు దస్థిరాం, ఆరోగ్య కార్యకర్త ప్లారెన్సు ఆశాలు పాల్గొన్నారు.

Related posts

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పండుగ

Satyam NEWS

కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్‌ కూలి ఆరుగురు మృతి

Murali Krishna

రూరల్ నియోజకవర్గం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది

Satyam NEWS

Leave a Comment