29.7 C
Hyderabad
May 3, 2024 05: 26 AM
Slider నెల్లూరు

రూరల్ నియోజకవర్గం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది

#nellorerural

నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇప్పుడు రౌడీయిజానికి తావు లేకుండా  ప్రశాంతంగా ఉందని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 23వ డివిజన్లోని చలపతి నగర్ లో మంగళవారం కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో  సీసీ రోడ్లకు ఎంపీ ఆదాల  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ డివిజన్లో 40 లక్షల రూపాయలతో సిసి రోడ్లకు శంకుస్థాపన చేశామని తెలిపారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్ కు 5 కోట్ల 25 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు.

మరో కోటి రూపాయలు డివిజన్ కు కేటాయిస్తున్నామని, అవసరం అయితే ముఖ్యమంత్రితో మాట్లాడి మరిన్ని నిధులు తెస్తామని చెప్పారు. ఇది ఎక్స్టెన్షన్ ఏరియా కావడం వల్ల ఇక్కడ అవసరాలు చాలా ఉన్నాయని, గతంలో ఇక్కడ లేఅవుట్లు వేసిన వారు కనీసం రోడ్లు కూడా వేయలేదని ఆక్షేపించారు. ప్రస్తుతం మాత్రం రోడ్లు, డ్రైన్లు తప్పనిసరి చేశామని చెప్పారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఇంటికే చేరుతున్నాయని తెలిపారు.

వాలంటీరు, సచివాలయ వ్యవస్థ  దీనికి కారణమని ప్రశంసించారు. సర్టిఫికెట్లు కూడా సచివాలయాల్లో లభిస్తున్నాయని, ఇటువంటి వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ వల్ల అవినీతి కూడా బాగా తగ్గిందని కొనియాడారు. ఒకపక్క సంక్షేమం, మరోపక్క అభివృద్ధి చేస్తున్నామని, అయితే అభివృద్ధి జరగడం లేదని చెప్పడం సరికాదన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ ను, మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి, పాతపాటి పుల్లారెడ్డి  ఆధ్వర్యంలో జరిగింది.

విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, కార్పొరేటర్లు మూలె విజయభాస్కర్ రెడ్డి, అవినాష్, మోబీన, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, వైసిపి నేతలు స్వర్ణ వెంకయ్య, సురేష్ రెడ్డి, హరిబాబు యాదవ్, పరమేశ్వర్ రెడ్డి, వంశీ, నరసింహారావు, నిజాముద్దీన్, శ్రీకాంత్ రెడ్డి, ఐరెడ్డి సుబ్బారెడ్డి, ఆదిరెడ్డి, చంద్రారెడ్డి, సూరిబాబు, తలారి విటల్, చంద్రమౌళి, మేఘనాథ్ సింగ్, యేసు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వనపర్తి జిల్లా కేంద్రంలో పోలీసుల రక్తదాన శిబిరం

Bhavani

పొట్టి శ్రీరాములు చిత్ర ప‌ఠానికి పూల‌మాల‌లు వేసిన విజయనగరం ఓఎస్డీ

Satyam NEWS

సాహస వీరుడు సూపర్ స్టార్ కృష్ణ

Satyam NEWS

Leave a Comment