39.2 C
Hyderabad
May 3, 2024 14: 43 PM
Slider హైదరాబాద్

వారసత్వ కట్టడాలకు కాలం చెల్లినట్లేనా?

Hearitage Structure

నాలుగు వందల ఏళ్ళకు పైగా చారిత్రక నేపథ్యం గల హైదరాబాద్ మహానగరం నలుమూలలలో వున్నవివిధ చారిత్రక కట్టడాలు ఇప్పుడు పగిలిపోతున్నాయి. వణికిపోతున్నాయి. నిలువుగా వున్నపలుగు… అడ్డంగా దెబ్బతీసే గడ్డపారలతో అటు ‍ఇటు ప్రజా సౌకర్యాల కోసమని చెప్పే అన్నిడిపార్ట్‌మెంట్లు అడ్డదిడ్ధంగా రోడ్లను తవ్విపారేస్తున్నాయి. ఆఫీసులకు.. రకరకాల పనుల మీద వాహనాలు ఉపయోగించే వాళ్లు కనీసం రోజులో పావుభాగం సమయం రోడ్లకే అంకితమైపోతున్నారు. పాత భవనాలు కూలిపోతున్నాయి. ఇటువంటి వాటిని సత్వరమే తొలగించకపోతే ప్రమాదాలు ముంచుకొచ్చేఅవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నాయి. ఇందుకుగాను హైదరాబాద్ నగర పాలక సంస్థ వ్యూహాత్మక పథకాలకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్నచారిత్రక కట్టడాలను పరిరక్షించే భాగంగా సంబంధిత శాఖలకు సలహాలు సిఫార్సులు చేసేందుకు ఒక కమిటీని నియమించే అవకాశం ఉంది. ఐఏఎస్ కేడర్ స్ఠాయి అధికారి ఒకరు ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఇప్పటికే చార్మినార్.. మక్కా మసీదు, గోల్కొండ ఖిల్లా, కుతుబ్ షాహి సమాధులు, పైగా టూంబ్స్ త‌దితర ప్రాంతాలు పురావస్తు శాఖ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం మరమ్మతుల వ్యవహారం వ్యవహారాలన్నీచర్చకు రావడంతో ప్రభుత్వ జోక్యం అనివార్యమైంది. దీంతో త్వరలోనే కమిటీ పనులు ప్రారంభం అవుతాయ‌ని అంచనా వేస్తున్నారు.

వి ఆర్ సుబ్రహ్మణ్యం

Related posts

రాజీవ్ గాంధీ హత్య కేసు: వేలూరు జైలు నుంచి విడుదలైన నళిని

Bhavani

మైనర్లు డ్రైవింగు చేయడంపై ప్రత్యేక డ్రైవ్…!

Satyam NEWS

తానా సభలకు వెళ్తున్న టి .డి .జనార్దన్

Bhavani

Leave a Comment