38.2 C
Hyderabad
April 29, 2024 13: 09 PM
Slider ముఖ్యంశాలు

మైనర్లు డ్రైవింగు చేయడంపై ప్రత్యేక డ్రైవ్…!

#trafficpolice

విజయనగరం లో 23 ప్రాంతాల్లో గుర్తించిన విజయనగరం కాప్స్….!

ఏపీ పోలీసు శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్ పై దృష్టి పెట్టారు సంబంధిత పోలీసులు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, రాజాం పట్టణాల్లో మైనరు డ్రైవింగు, మద్యం సేవించిన వాహనాలు నడిపిన వారిపైన, త్రిబుల్ రైడింగు, నంబరు ప్లేట్స్ లేని వాహనాలు నడిపిన వారిపైన ఏప్రిల్ 11న ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

ఇందులో భాగంగా విజయనగరం పట్టణలోని గంట స్థంభం, కోట, ఎత్తు బ్రిడ్జి, కలెక్టరేట్ జంక్షన్, ఆర్టీసి కాంప్లెక్స్, దాసన్నపేట, బాలాజీ జంక్షన్, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, కొత్తపేట, ఫోర్టు సిటీ జంక్షన్, పూల్ బాగ్, ధర్మపురి, జమ్ము నారాయణపురం, విటి అగ్రహారం వంటి 23 ప్రాంతాల్లోను, రాజాం, బొబ్బిలి పట్టణంలోని ముఖ్య కూడళ్ళలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు మైనర్లు కారకులు కావడం, వారికి రహదారి భద్రత నియమాలపట్ల అవగాహన లేకపోవడం, వాహనాల వేగంపై నియంత్రణ లేకపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం నేరమని, ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా డ్రైవింగు లైసెన్సు కలిగి, భద్రత నియమాలు పాటించాలని వాహనదారులకు సంబంధిత పోలీసు అధికారులు కౌన్సిలింగు నిర్వహించారు. వాహన తనిఖీల్లో పట్టుబడిన మైనర్లుకు వారి తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సిలింగు నిర్వహించి, అతి వేగంతో వాహనాలు నడపడం వలన, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వలన కలిగే అనర్థాలను వారికి వివరించి, మైనర్లుకు వాహనాలు ఇచ్చినట్లయితే సంబంధిత వాహనదారులపై కూడా కేసులు తప్పవని హెచ్చరించారు.

జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో ట్రాఫిక్ డిఎస్పీఎల్.మోహనరావు, విజయనగరం డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు ఆధ్వర్యంలో సిఐలు బి. వెంకటరావు, సిహెచ్. లక్ష్మణరావు, టివి తిరుపతిరావు, కే.రవికుమార్, ఎం.నాగేశ్వరరావు మరియు ఎస్ఐలు వారి పోలీసు స్టేషను పరిధిలో వివిధ కూడళ్ళలో వాహన తనిఖీలు చేపట్టి, మైనరు డ్రైవింగు, నంబరు ప్లేట్లు లేని వాహనాలు, ట్రిపుల్ రైడింగు, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ స్పెషల్ డ్రైవ్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 18 కేసులు, మైనరు డ్రైవింగుపై 125 కేసులు, నంబరు ప్లేట్స్ సక్రమంగా లేని వాహనదారులపై 70 కేసులు, ట్రిపుల్ డ్రైవింగుపై 40 కేసులు నమోదు చేసామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. ఈ తరహా స్పెషల్ డ్రైవ్ లు భవిష్యత్తులో కూడా జరుగుతామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక అన్నారు.

Related posts

దుష్ట చైనా కుట్ర: సరిహద్దుల్లో మళ్ళీ అలజడి!

Bhavani

అనంతపురంలో స్పందన కార్యక్రమం

Bhavani

వందేళ్ల చరిత్ర కలిగిన సంగీత కళాశాలలో కళానిధి మంగళం పల్లి జయంతోత్సవం

Satyam NEWS

Leave a Comment