27 C
Hyderabad
May 10, 2024 06: 59 AM
Slider ముఖ్యంశాలు

హేట్సాప్..విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ దీపికా ఎం.పాటిల్

#deepika patil

ఈ నెల12 వ‌తేదీన‌  జిల్లా ఎస్పీగా బాద్య‌త‌లు చేపట్టిన ఎస్పీ దీపికా పాటిల్…వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు యావ‌త్ పోలీస్ శాఖ‌కే ఆద‌ర్శంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఎస్పీ న‌డ‌వ‌డిక‌,ప‌ని చేసే విధానం….వ్య‌వ‌హ‌రించిన తీరు ప్ర‌స్పుట‌మ‌వుతోంది.

ప‌ద‌వీ చేప‌ట్టిన అతి కొద్ది రోజుల్లో…పోలీస్ స్టేష‌న్ ల‌లో సిబ్బంది ప‌నితీరు..బాధితుల ప‌ట్ల సిబ్బంది  వ్య‌వ‌హరిస్తున్న విధానాల‌పై త‌న మార్క్  చూపించిన లేడీ ఎప్పీ దీపికా..తాజాగా బేర‌క్స్ లో జ‌రిగిన సిబ్బంది ప‌ద‌వీ విర‌మణ కార్య‌క్ర‌మంలో కూడా ఎస్పీ వ్య‌వ‌హ‌రించిన తీరు…సిబ్బందికి ఆదర్శ ప్రాయంగా ఉంద‌నే చెప్పాలి.

పోలీస్ బ్యారెక్స్ లో  ఇద్దరు ఎస్ఐలు,ముగ్గురు కానిస్టేబుళ్ల ప‌ద‌వీ విర‌మ‌ణ కార్య‌క్ర‌మ స్థ‌లం…జిల్లా పోలీస్ కార్యాల‌యానికి..దాదాపు 100 అడుగుల దూరంలో ఉంది.కార్య‌క్ర‌మం ప్రారంభమై…ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, ట్రాఫిక్ డీఎస్పీ మోహ‌న్ రావు, ఏఎస్పీ స‌త్య‌నారాయ‌ణ‌లు మాట్లాడిన త‌ర్వాత ఎస్పీ దీపికా …ప‌దవీ విర‌మ‌ణ చేసిన సిబ్బందనుద్దేశించి మాట్లాడారు.

ఆ త‌ర్వాత అయిదుగురు సిబ్బందిని స‌త్క‌రించారు కూడ‌.  తిరిగి డీపోఓకు వెళ్లిపోవాలి. శాఖా ప‌రంగా పోలీస్ శాఖ స‌మ‌కూర్చిన వాహ‌నంలోనే ఎస్పీ డీపీఓకు వెళ్లాలి. కాని డీపీఓ నుంచీ బ్యారెక్స్ వ‌చ్చిన‌ప్పుడు  స‌భా స్థ‌లి వ‌ర‌కు న‌డుచుకుంటూ వ‌చ్చిన ఎస్పీ…తిరిగి ప‌ద‌వీ విర‌మ‌ణ కార్య‌క్ర‌మం అయిపోయిన త‌ర్వాత కూడా…న‌డుచుకుంటూనే డీపీఓకు వెళ్లిపోయారు.

ఈ ఘ‌ట‌న శాఖ సిబ్బందిలో ఒకింత స్పూర్తినిచ్చింద‌నే చెప్పాలి. గ‌త నెల వ‌ర‌కు ఎస్పీగా ప‌ని చేసిన రాజ‌కుమారీ స‌మ‌యంలోనే జూన్ నెల‌లోనే ఇలాగే కొంత‌మంది సిబ్బంది  ప‌ద‌వీ విర‌మ‌ణ చేసారు.అ స‌మ‌యంలో  ఎస్పీ రాజకుమారీ కాలు కింద పెట్ట‌కుండానే డీపీఓ నుంచీ కారులో బ్యారెక్స్ లోజ‌రిగిన స‌భా స్థ‌లికి వ‌చ్చి తిరిగి ప‌ద‌వీ విర‌మ‌ణ  పూర్త‌యిన వెంట‌నే తిరిగి కారులోనే  డీపీఓకు వెళ్లారు.

అయితే  కొత్త‌గా వ‌చ్చిన ఎస్పీ దీపికా పాటిల్…మాత్రం వాహ‌నం లేకుండానే…డీపీఓ నుంచీ న‌డిచి మ‌ర‌ల బ్యారెక్స్ నుంచీ తిరిగి  డీపీఓకు  న‌డుచుకునే వెళ్ల‌డం…అటు వేసుకున్న పోలీస్ యూనీఫాంతో పాటు అనుభ‌విస్తున్న ప‌ద‌వికి త‌ద్వారా పోలీస్ శాఖ సిబ్బందికి ఓర‌కంగా స్పూర్తిగా నిలిచార‌ని అంటోంది….స‌త్యం న్యూస్.నెట్. హ్యేట్సాఫ్…ఎస్పీ దీపికా మేడమ్…!

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్, విజయనగరం

Related posts

క్వశ్చన్ అవర్:ఆర్ధిక నేరస్తులకు ఉరిశిక్ష వేస్తారా?

Satyam NEWS

కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ లో ఉపాధి అవకాశాలు

Satyam NEWS

బీ టెక్ విద్యార్థులకు తగిన నైపుణ్యాలను అందించాలి

Satyam NEWS

Leave a Comment