25.2 C
Hyderabad
October 10, 2024 20: 36 PM
Slider ముఖ్యంశాలు

క్వశ్చన్ అవర్:ఆర్ధిక నేరస్తులకు ఉరిశిక్ష వేస్తారా?

manda krishna 17

రేప్ చేసిన వారిపై కేసు విచారణ జరిపి 21 రోజుల్లో శిక్షవేస్తామని చెప్పిన ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదే తరహా చట్టాన్ని ఆర్ధిక నేరస్తులకు కూడా తీసుకువస్తారా అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు.

ఆర్ధిక నేరస్తుల కేసులు కూడా 21 రోజుల్లో విచారించి ఉరిశిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై కేసీఆర్‌కు ఏపీ సీఎం జగన్‌ హ్యాట్సాఫ్ చెప్పడం సిగ్గుచేటని ఆయన అన్నారు. జగన్ కు అవగాహన లోపం ఉందని ఆయన విమర్శించారు.

టోల్‌గేట్ దగ్గర టోల్‌ ఫీజ్ చెల్లించడానికి దిశ వెళ్లిందనడం జగన్‌ అవగాహనలేమికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్‌, పోలీసుల వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకే ఎన్‌కౌంటర్ చేశారని మంద కృష్ణ మాదిగ విమర్శించారు.

Related posts

చిన్న‌శేష వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

Satyam NEWS

గ్యాస్ ఏజెన్సీ లపై చర్యలు తీసుకోవాలి

Bhavani

Over-The-Counter Lower Blood Pressure Medication Quick Way To Lower Blood Pressure At Home

Bhavani

Leave a Comment