ఢిల్లీ జేఎన్‌యూ వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఫీజుల పెంపునకు నిరసనగా జేఎన్ఎస్‌యూ విద్యార్థులు పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్రిక్తతలకు దారి తీయవచ్చనే అనుమానంతో క్యాంపస్ బయట దాదాపు 1200 మంది భద్రతా సిబ్బంది మోహరించారు. క్యాంపస్ వద్ద, పార్లమెంటు బయట 144 సెక్షన్ విధించారు.
జేఎన్‌యూలో వసతిగృహ ఫీజులను పెంచుతూ వర్శిటీ కార్యనిర్వాహక శాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో గతవారం రోజుల నుంచి విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పార్లమెంటు ముట్టడికి జేఎన్‌ఎస్‌యూ పిలుపునిచ్చింది.