37.2 C
Hyderabad
May 2, 2024 13: 30 PM
Slider హైదరాబాద్

వరద సాయంలో పక్షపాతం పై వెల్లువెత్తిన ప్రజా ఆగ్రహం

#BJPKukatpally

ప్రభుత్వం ప్రకటించిన పది వేల రూపాయల ఆర్థిక సహాయం కేవలం తెరాస కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళనకు దిగడంతో హైదరాబాద్ లోని కూకట్ పల్లి డివిజన్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.

ఇక్కడి ప్రజలు అధికారులు, TRS నాయకులను ప్రజలు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ యువ నాయకుడు విజిత్ వర్మ ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకై అధికారులను నిలదీశారు. కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని దాయారుగుడా బస్తీలో, సంగీత్ నగర్ లో ప్రజలు నిలదీయడంతో అధికారులు హతాశులయ్యారు.

కొందరు అక్రమార్కులు ఇష్టం వచ్చినట్టు దండుకుంటున్నారని, నిజమైన బాధితులకు వరద సాయం అందడం లేదని ప్రజలు విమర్శించారు. అధికారులు స్పందించకపోవడంతో దాయారుగుడా అంబెడ్కర్ చౌరస్తా దగ్గర బాధితులతో కలిసి బిజెపి నాయకులు ధర్నా చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు విజిత్ వర్మ ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. దీనితో మాకోసం వచ్చి ఉద్యమిస్తున్న ప్రజల మనిషిని అరెస్ట్ చేస్తారా అంటూ అక్కడ కి వచ్చిన మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగి తీవ్రంగా ప్రతిఘటించారు.

చివరికి పోలీసు ఉన్నతాధికారు జోక్యం చేసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడించి రేపు బస్తీలో కి వచ్చి అందరికి సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీనితో శాంతించిన ప్రజలు ధర్నాను విరమించారు. పోలీసులు విజిత్ వర్మను అక్కడినుంచి స్టేషన్ కు తీసుకెళ్లారు. 

అధికారులు రేపు ప్రజలకు న్యాయం చేయకపోతే మళ్ళీ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. ఈ ధర్నాలో కూకట్ పల్లి ఇంచార్జ్ ఆర్షణపల్లి సూర్యారావు, సీనియర్ నాయకుడు పద్మయ్య, డివిజన్ అధ్యక్షుడు అనంత నాగరాజు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అప్పుడు కన్ను గీటి ఇప్పుడు స్మిమ్మింగ్ పూల్ లో మునిగి

Satyam NEWS

ఎన్నికల సంఘం కార్యదర్శిగా వాణీమోహన్

Satyam NEWS

కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల దోపిడీ

Satyam NEWS

Leave a Comment