40.2 C
Hyderabad
May 2, 2024 17: 49 PM
Slider ప్రత్యేకం

ఏపీలో ఐదు రోజులపాటు భారీ వర్షాలు

#Heavy rains

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ నెల 26వ తేదీన వాయిగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తోంది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి.

ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సైతం ధృవీకరించింది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం పశ్చిమ మధ్య & ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర -దక్షిణ ఒడిశా మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏర్పడందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ వెల్లడించారు.

బుధవారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపారు. ఆతర్వాత ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయని వెల్లడించారు. బుధవారం అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, గురువారం భారీవర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడనున్నట్లు వివరించారు. బుధవారం.. కృష్ణా, ఆర్,గుంటూరు,పల్నాడు,బాపట్ల,ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

Related posts

అనంతనాగ్ లో మళ్లీ కూలీలపై కాల్పులు

Satyam NEWS

మంత్రి  కే టి ఆర్  రాజీనామా చేయాలి

Satyam NEWS

ఇద్దరు పసిపిల్లలను ఉరి వేసి హత్య చేసిన తల్లి

Satyam NEWS

Leave a Comment