33.7 C
Hyderabad
April 30, 2024 00: 46 AM
Slider నల్గొండ

ప్రమోషన్ పొందిన ఇన్స్పెక్టర్లను అభినందించిన ఎస్పీ

#SP congratulated

సూర్యాపేట జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ లో ఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్న నలుగురు ఎస్సైలు డానియల్, నాగభూషణం, శివ కుమార్, మహేష్ పోలీసు ఇన్స్పెక్టర్స్ గా ప్రమోషన్ లభించినది. ప్రమోషన్ పొందిన నలుగురు ఇన్స్పెక్టర్స్ జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది.

ఈ సందర్భంగా ఎస్పీ ప్రమోషన్ పొందిన సిబ్బందికి స్టార్స్ ను అందించి శుభాకాంక్షలు తెలిపి అభినందించినారు. పోలీసు ఉద్యోగం అనునిత్యం సవాళ్ళతో కూడినదని సవాళ్లను అధిగమిస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని, ప్రమోషన్ విధి నిర్వహణలో బాధ్యతలను పెంచుతుందని, ప్రజల అంచనాలకు, అధికారుల అంచనాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని ప్రమోషన్ పొందిన సిబ్బందికి తెలిపినారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రాజేష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగార్జున, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ రాము, పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, శ్రీనివాస రావు, సిబ్బంది ఉన్నారు.

Related posts

న్యాయానికి న్యాయం కావాలి మిలార్డ్

Satyam NEWS

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దివ్యాంగులు ర్యాలీ

Satyam NEWS

ప్రభుత్వ ఉత్తర్వులను అధిగమిస్తే చట్టపర చర్యలు

Satyam NEWS

Leave a Comment