33.7 C
Hyderabad
April 29, 2024 01: 36 AM
Slider తెలంగాణ

చెన్నమనేని పౌరసత్వం చెల్లదంటే చెల్లదు అంతే

ramesh

వేములవాడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం చెల్లదంటూ మళ్లీ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు నెంబర్ 260 7 2 7/30/ 2008 ఐ సితో బుధవారం ఉత్తర్వులు భారత ప్రభుత్వ కార్యదర్శి సుధాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. రమేష్ బాబు భారత పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ న్యాయస్థానంలో న్యాయ పోరాటం  చేయటం తెలిసిందే. కేంద్ర హోంశాఖ గతంలో ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు రద్దు చేసి తిరిగి మరోసారి బాబు పౌరసత్వంపై విచారణ చేపట్టాలని 10(3) నిబంధనను కూడా చట్టప్రకారం పరిశీలించాల్సిందిగా కేంద్ర హోంశాఖ తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ విచారణను 12 వారాలలో తేల్చాల్సింది గా తెలంగాణ హైకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. తెలంగాణ హైకోర్టు  ఆదేశాలనుసారం గత నెల అక్టోబర్ 31/ 2019 న ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ కార్యాలయంలోని నార్త్ బ్లాక్ లో గల బోర్డర్ మేనేజ్మెంట్ సెక్రెటరీ నెంబర్ 124 లో నిర్వహించిన విచారణకు ఎమ్మెల్యే రమేష్ బాబు తరఫున లాయరు వై రామారావు వు, ఆది శ్రీనివాస్ అతని న్యాయవాదులు రవి కిరణ్ రావు, రోహిత్ రావులుహాజరై తమ వాదనలను వినిపించారు. భారత పౌరసత్వం పొందే క్రమంలో రమేష్ బాబు ఉల్లంఘించిన నిబంధనలు ,చేసిన మోసాన్ని ఆది శ్రీనివాస్ సాక్ష్యాధారాలతో హోం శాఖ ముందుంచారు. సమగ్ర, సంపూర్ణ విచారణ అనంతరం 20 రోజుల తరువాత కేంద్ర హోంశాఖ టిఆర్ఎస్ ఎమ్మెల్యే రమేష్ బాబు భారత పౌరుడు కాదని మళ్ళీ తేల్చేసింది.

Related posts

(Free|Sample) < Remedies To Lower Blood Sugar Diabetes And Homeopathic Medicines

Bhavani

పరీక్షలు లేకుండానే పదోతరగతి విద్యార్థుల ప్రమోషన్

Satyam NEWS

అందని లోకాలకు చందమామ శంకర్

Satyam NEWS

Leave a Comment