42.2 C
Hyderabad
May 3, 2024 17: 25 PM
Slider పశ్చిమగోదావరి

4,5 తేదీలలో ఏలూరులో హేలాపురి బాలోత్సవం

#Helapuri Balotsavam

4,5 తేదీలలో ఏలూరులో హేలాపురి బాలోత్సవం 3వ పిల్లల సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ, బాలోత్సవం ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు షేక్ సాబ్జి చెప్పారు.స్థానిక పవరు పేటలోని అన్నే భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏలూరులోని సర్ సి.ఆర్. రెడ్డి పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఈనెల 4వ తేదీ ఉదయం 9.30 గంటలకు హేలాపురి బాలోత్సవం మూడవ పిల్లల సంబరాలు ప్రారంభమవుతాయని అన్నారు. బాలోత్సవం కార్యక్రమాలు ఘనంగా జరిపేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. బాలోత్సవం జయప్రదానికి వివిధ కమిటీలు ఏర్పాటు చేసి కృషి చేస్తున్నామని వివరించారు.

ఏలూరు నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రముఖులు, పెద్దలు, వర్తక వాణిజ్య వర్గాలు, విద్యాసంస్థలు అందరూ సహకరించాలని కోరారు. రేపటి పౌరులను దేశభక్తులుగా, సామాజిక దృక్పథం కలిగినవారిగా, పర్యావరణ ప్రేమికులుగా, సేవా తత్పరులుగా మార్చేందుకు విజ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మాణం చేసేందుకు ఈ బాలోత్సవ కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని చెప్పారు. బాలోత్సవ పిల్లల సంబరాలలో ఏలూరు నగరం తో పాటు ఏలూరు, పెదపాడు, పెదవేగి, దెందులూరు, భీమడోలు, ముసునూరు మండలాల్లోని 570 స్కూలుకు సంబంధించిన మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న వేలాది మంది విద్యార్థినీ, విద్యార్థులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. 60 రకాల కల్చరల్ మరియు అకడమిక్ పోటీలలో విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తారని వివరించారు.

ఏలూరు నగరంలో పెద్ద ఎత్తున జరుగుతున్న బాలోత్సవం మూడవ పిల్లల సంబరాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.బాలోత్సవ ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎల్. వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ హేలాపురి బాలోత్సవంలో భాగంగా పాడుదమా స్వేచ్ఛా గీతం పాటను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేసేందుకు వెయ్యి మంది విద్యార్థులతో నాలుగో తేదీన కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. రెండు రోజులు పాటు జరిగే ఈ బాలోత్సవం పిల్లల సంబరాలలో విజేతలకు సర్టిఫికెట్స్, మెడల్స్, జ్ఞాపికలు

అందజేస్తామని తెలియజేశారు. బాలోత్సవం విజయవంతం చేసేందుకు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ విద్యార్థులను ప్రోత్సహించి వివిధ పోటీలలో వారు పాల్గొనేటట్లు చేసి సహకరించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. బాలోత్సవం మూడవ పిల్లల సంబరాల పోస్టర్లను ఆహ్వాన సంఘం కమిటీ నాయకులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో బాలోత్సవం ఆహ్వాన సంఘం కమిటీ నాయకులు కె.శ్రీనివాస్, వై. ఆనంద నాయుడు, ముస్తాఫ అలీ, వి.సురేష్, ఎం అజయ్ బాబు,కె.సత్యనారాయణ,ఎ. బి త్రిపుర సుందరి, కట్టా సత్యనారాయణ, జి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత

Satyam NEWS

ప్రమాదకరంగా పుట్టిలో వారు… నదిలో పశువులు: 12 మంది అరెస్టు

Satyam NEWS

కెనరా బ్యాంక్ అధికారుల పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment