29.7 C
Hyderabad
May 3, 2024 05: 39 AM
Slider గుంటూరు

కెనరా బ్యాంక్ అధికారుల పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

#chadalawada

అమరా ఇంజనీరింగ్ కళాశాల డైర్మన్ అమరా వెంకటేశ్వరరావు బలవర్మరణానికి కారణమైన కెనరా బ్యాంక్ అధికారుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో డా౹౹చదలవాడ మాట్లాడుతూ అమరా వెంకటేశ్వరరావు మృతికి సంబంధించి అధికార పార్టీ నాయకులు ఎందుకు ముందుగా భుజాలు తరుముకుంటున్నారో తమకు అర్ధం కావడం లేదన్నారు.

తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరా వెంకటేశ్వరరావు కుటుంబానికి అండగా నిలిచేందుకు మాత్రమే ముందుకు వచ్చామన్నారు.వ్యక్తిగతంగా ఎవరిపైనా ఆరోపణలు చేయలేదన్నారు.అమరా వెంకటేశ్వరరావు సతీమణి సోషల్ మీడియాలో ప్రకటన చేయడంతో చంద్రబాబునాయుడు దాని పై స్పందించి వారికి అండగా నిలవాలని తమకు సూచించారని తెలిపారు.వైసీపీ నాయకులు నియోజకవర్గంలో చేస్తున్న అవినీతి అంతా ఇంత  కాదన్నారు.దుర్మార్గలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.టౌన్ హాల్, స్టేడియం,షాదిఖానా,టీడీపీ హయాంలో పలు కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను దుర్మారంగా ద్వంసం చేశారని తెలిపారు.

అధికార పార్టీ నాయకుల వల్లన ఎంతో మంది కన్నీరు పెడుతున్నారన్నారు.కోట్ల రూపాయలు ఐపి పెట్టిన వారు,దొంగ మందులు, తెలంగాణ మధ్యం అమ్మేవారు అధికార పార్టీలో నాయకులుగా చలామణి అవుతున్నారని విమర్శించారు.ఇప్పటికైనా విమర్శలు మాని అమరా వెంకటేశ్వరరావు కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూడాలని డా౹౹చదలవాడ విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి అత్తులురి సుబ్బారావు, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి వనమా శివ,గుంటూరు కార్పొరేటర్లు వరప్రసాద్ (సిటీ బస్సు బాబు),కొమ్మినేని కోటేశ్వరరావు, గుంటూరు వాణిజ్యవి బాగా అధ్యక్షులు తల్లం శేఖర్ పాల్గొన్నారు.

Related posts

పురాతన ఆలయాల అభివృద్ధికి 10 కోట్లు మంజూరు

Satyam NEWS

జస్టిస్ ఫర్ దిశ కేసులో నేరస్తులను కఠినంగా శిక్షించాలి

Satyam NEWS

GD నెల్లూరు నియోజకవర్గంలో YCPకి వర్గపోరు

Satyam NEWS

Leave a Comment