26.2 C
Hyderabad
May 10, 2024 19: 40 PM
Slider విజయనగరం

హెల్మెట్ పెట్టుకోకపోతే ఇక అంతే!

Helmet

కరోనా కష్ట సమయం సడలింది. ఇక రోడ్లపై వాహనాలు రయ్యరయ్యమంటూ తిరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో చాలా చోట్ల చాలా మంది హెల్మెట్లు లేకుండా వాహనాలను నడుపుతున్నారు. దీంతో హెల్మెట్ ధరించడంపై ప్రజలలో అవగాహన క‌లిగించే చర్యలకు ట్రాఫిక్ పోలీసులు దిగారు.


ఇందులో భాగంగా ఏపీ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్పీ…తన సిబ్బందితో హెల్మెట్ అవేర్నస్ కార్యక్రమం చేపట్టారు. నో హెల్మెట్, నో జర్నీ అంటూ రోడ్లపై వచ్చిన వాహనాల చోదకులను వెనక్కి పంపించారు. విజయనగరంలో ఎత్తు రోడ్డు బ్రిడ్జిపై ఈ హెల్మెట్ అవగాహన చర్యలు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ మోహన్ రావు, సీఐ ఎర్రంనాయుడు, ఎస్ఐలు జీయాయుద్దీన్, ప్రసాద్ రావు, ఏఏస్ఐ రామకృష్ణ లు ఉన్నారు.

Related posts

జగన్ మందలింపుతో పదవి వీడిన లోకేశ్వర్ రెడ్డి

Satyam NEWS

తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి కి ఘన నివాళులు

Satyam NEWS

లిక్కర్ స్టోరీ: మందలించినందుకు యువకుడి ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment