28.7 C
Hyderabad
April 27, 2024 03: 16 AM
Slider ప్రత్యేకం

జగన్ మందలింపుతో పదవి వీడిన లోకేశ్వర్ రెడ్డి

#Y S Jaganmohan Reddy

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య విభేదాలు ఒక్క సారిగా భగ్గుమన్నాయి.

ముఖ్యమంత్రి జగన్ తన మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డికి మద్దతు పలకడంతో ప్రభుత్వ ఐటి సలహాదారుడికి లోకేశ్వర్ రెడ్డి తీవ్ర నిరసన తెలుపుతూ తన పదవికి రాజీనామా చేశారు.

చెన్నూరు మండలం ఉప్పరపల్లి సర్పంచ్ పదవికి తన వదిన చేత లోకేశ్వరరెడ్డి నామినేషన్ వేయించారు.

అయితే పోటీగా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి తన అనుచరుడు అయిన రాజేంద్రనాధరెడ్డి భార్యతో నామినేషన్ వేయించారు.

ఈ పంచాయితీ మొత్తం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చేరింది. దాంతో ఆయన ఫోన్ చేసి లోకేశ్వరరెడ్డిని తీవ్రంగా మందలించారని అంటున్నారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని మందలించడంతో లోకేశ్వరరెడ్డి తీవ్ర మనస్థాపానికి లోనయ్యారని అంటున్నారు.

ఆయన తన పదవికి రాజీనామా చేయగా తక్షణమే ప్రభుత్వం నుంచి ఆ రాజీనామా ఆమోదిస్తునట్లు ప్రకటన వచ్చింది. పంచాయితీ ఎన్నికల పంచాయితీ అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలా చిచ్చు రగిల్చాయి.

Related posts

అడవుల పరిరక్షణ మనందరి బాధ్యత

Satyam NEWS

గుజరాత్ సర్కార్ లో సమూల మార్పులు..?

Sub Editor

రైతులను ఇబ్బంది పెడుతున్న కేంద్రo

Murali Krishna

Leave a Comment