29.7 C
Hyderabad
May 4, 2024 05: 39 AM
Slider ప్రత్యేకం

శారదా పీఠం స్వామికి అవమానం: ప్రభుత్వానికి చెంపపెట్టు

#SaradaPeetham

విశాఖ శారదా పీఠం స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతికి తీరని అవమానం జరిగింది. రాజగురువుగా పూజలు అందుకుంటున్న స్వారూపానందేంద్ర స్వామి పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయాల నుంచి ఆలయ సాంప్రదాయాల ప్రకారం మర్యాదలు చెయ్యాలని, కానుకలు పంపాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది.

ఈ నెల 18న స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి పుట్టిన రోజు. ఈ పండుగ రోజును వైభవంగా నిర్వహించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 23 దేవాలయాల నుంచి ఆలయ అర్చకులు, ఈవోలు విశాఖ శారదా పీఠానికి వెళ్లి స్వామి వారికి ఆశీర్వాదం ఇవ్వాలని ఆదేశించింది.

అయితే ఈ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేస్తూ కేసు దాఖలు అయింది. దీనిపై రాష్ట్ర హైకోర్టు విచారణ ప్రారంభించగానే శారదా పీఠం నుంచి తాము రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖను ఉప సంహరించుకుంటున్నామని శారదా పీఠం న్యాయ వాది కోర్టుకు విన్నవించారు. దీంతో ప్రత్యేక మర్యాదలపై దేవాదాయశాఖ ఇచ్చిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది.   

Related posts

విలాసాలకు మరిగిన యువకులు చోరీలు చేస్తూ…

Satyam NEWS

కంకులు కొన్న కవిత

Bhavani

శవాలుగా కనిపించిన తండ్రి కొడుకులు

Satyam NEWS

Leave a Comment