33.7 C
Hyderabad
April 28, 2024 23: 31 PM
Slider ముఖ్యంశాలు

డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే

#APHighcourt

జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జగన్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఘన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ధర్మాసనం ముందు విచారణ జరగగా టెట్ మరియు డీఎస్సీ కి మధ్య కేవలం ఒక్కరోజు సమయాన్ని కేటాయించటం చట్టరీత్యా విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడింది. టెట్ రిజల్ట్ తర్వాత అభ్యర్థుల నుంచి అబ్జెక్షన్స్ తీసుకునే విధానంపై 2018 లో ఇచ్చిన ప్రభుత్వ నిబంధనలను పాటించలేదని హైకోర్టు తెలిపింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలో పరీక్ష నిర్వహించాలి అనటం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటమే అని హైకోర్టు అభిప్రాయపడింది. గతంలో బి.ఎడ్ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అనుమతించడంపై కూడా హైకోర్టు  ప్రాధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం స్టే విధించింది. గతంలో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ మరియు శరత్ చంద్ర వాదనను వినిపించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్టే విధించడంతో డీఎస్సీ నిర్వహణ ఆగిపోయినట్లేని న్యాయ నిపుణుల అభిప్రాయం.

Related posts

నేనైతే ఎంపీ గానే పోటీ చేస్తాను: రఘురామ కృష్ణంరాజు

Satyam NEWS

ఏపిలో మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం

Satyam NEWS

మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Satyam NEWS

Leave a Comment