37.2 C
Hyderabad
May 6, 2024 19: 55 PM
Slider హైదరాబాద్

అతివేగం ఎంత ప్రమాదకరమైనదో ఒక్కసారి చూడండి

#road accident

అతి వేగం ఎంత ప్రమాదకరమైనదో కళ్లకు కట్టినట్లు చూపించే మరో సంఘటన ఇది. అతి వేగంగా వస్తుంటే అదుపుతప్పడం జరుగుతుంది. అలానే జరిగి ఒక యువకుడు అక్కడికక్కడే మరణించిన ఈ దుర్ఘటన వీడియో నేడు బయటకు వచ్చింది.

అది హైదరాబాద్ బాలానగర్… నూతన ఫ్లై ఓవర్. అడ్డంకులు ఏవీలేవు… వేగంగా వెళ్లవచ్చు. సౌకర్యం కోసం నిర్మించిన ఈ ఫ్లైఓవర్ పై అతి వేగం, అజాగ్రత్త అతని ప్రాణాన్ని తీసింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు…

హైదరాబాద్ కెపిహెచ్ బి లో ఉండే తన సోదరుడు ఇంటికి వచ్చాడు. లైసెన్స్ తీసుకునేందుకు తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయానికి బైక్ పై బాలానగర్ ఫ్లై ఓవర్ పై నుండి అతి వేగంగా వెళ్తూ ఎడమవైపు ఉండే సేఫ్టీ డివైడర్ ను ఢీ కొట్టాడు…

బైక్ పై అతివేగంగా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై వెళ్తూ సేఫ్టీ గోడను ఢీకొని యువకుడు మృతి సంఘటన 20జూలై రోజున జరిగింది.

Related posts

దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు వేతనాలు పెంపు

Satyam NEWS

1010 ఉద్యోగాల భర్తీకి  సీఎం గ్రీన్ సిగ్నల్

Murali Krishna

16 నెలలు జైల్లో ఉండే దొంగ రాష్ట్ర సీఎం.. ఇదీ మన ఖర్మ

Satyam NEWS

Leave a Comment