29.7 C
Hyderabad
May 2, 2024 06: 29 AM
Slider ప్రత్యేకం

1010 ఉద్యోగాల భర్తీకి  సీఎం గ్రీన్ సిగ్నల్

#cmjagan

రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు మంచి సదుపాయాలు అందించాల్సిన బాధ్యత ఉందని సీఎం జగన్ అన్నారు. వారు బాగా చదువుకోవడానికి, ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలని సీఎం జగన్ సూచించారు. మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్ల పై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు మంచి సదుపాయాలు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. వారు బాగా చదువుకోవడానికి, ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలని సీఎం సూచించారు. హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలని, ఖాళీగా ఉన్న759 మంది వెల్ఫేర్ ఆఫీసర్స్, 171 మంది ట్రైబల్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, 80 మంది కేర్ టేకర్లు కలిపి మొత్తం 1010 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లలో క్లాస్‌-4 ఉద్యోగుల నియామకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతి హాస్టల్‌ను పరిశీలించి కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలన్నారు. పిల్లలకు నాణ్యమైన వస్తువులను అందించాలన్నారు. పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లలో క్లాస్‌-4 ఉద్యోగుల నియామకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలని, మండలాల వారీగా పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రతి హాస్టల్‌ను పరిశీలించి కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలని సీఎం జగన్ సూచించారు.

Related posts

మరింత పటిష్టంగా ఐసోలేషన్ వార్డుల నిర్వహణ

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: టీటీడీ అధికారుల వ్యవహారశైలిపై విచారణ జరపాలి

Satyam NEWS

మహిళా ఆర్మీ అధికారులకు స్టాండింగ్ కమిషన్..

Sub Editor

Leave a Comment