29.7 C
Hyderabad
May 3, 2024 05: 47 AM
Slider కృష్ణ

దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు వేతనాలు పెంపు

#Kottu Satyanarayana

రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో పనిచేస్తున్న2625 మంది అర్చకులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలో భాగంగా అర్చకులకు వేతనాలు పెంచడం జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో అర్చకులకు ఇచ్చిన హామీ మేరకు అర్చకుల వేతనాలను పెంచేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.ఇప్పటికే 5వేల రూ.లు వేతనాన్ని తీసికుంటున్న అర్చకుల వేతనాన్ని 5వేల నుండి 10వేల రూ.లకు,10వేల రూ.లు తీసుకుంటున్న అర్చకుల వేతనాన్ని 10వేల రూ.ల నుండి 15వేల 650 రూ.లకు పెంచినట్టు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యానారాయణ చెప్పారు.

రాష్ట్రంలో గ్రేడ్-3 దేవాలయాల్లో పనిచేస్తున్న ఇఓలకు ఇచ్చిన పదోన్నతి ఉత్తర్వులను నిలుపదల చేయడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ వెల్లడించారు.అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాల్లోని ఇంజనీరింగ్,విద్యుత్ విభాగాల్లో చాలా వరకూ సాంకేతిక సిబ్బంది పోస్టుల భర్తీ చేయాల్సి ఉందని ఈనియామకాలకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు చెప్పారు.
దేవాలయాలకు చెందిన ఆస్తుల పరిరక్షణకు సెక్షన్ 83లో సవరణలు తీసుకురావడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ చెప్పారు.ఎవరైనా దేవాలయాల ఆస్తులను ఆక్రమించుకుంటే 8ఏళ్ళ వరకూ శిక్షపడే విధంగా చట్టంలో మార్పులు తేవడం జరిగిందని తెలిపారు.

రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ,వార్డు వాలంటీర్ల వ్యవస్థ గురించి ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యను అధికమించేందుకు 2లక్షల 60 వేల మంది యువతకు గ్రామ,వార్డు వాలంటీర్లుగా ఉపాధి కల్పించడం జరిగిందని డిప్యూటీ సియం పేర్కొన్నారు.వీరి నియామకంలో సామాజిక న్యాయాన్నిపాటించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రకారం నియమించామని స్పష్టం చేశారు.వాలంటీర్లలో లక్షా 80 మంది వరకూ మహిళలే ఉన్నారని చెప్పారు.రాష్ట్రంలోని ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ల వంతున కోటి 60 లక్షల కుటుంబాలకు వీరు సేవలందిస్తున్నారని ఉప ముఖ్యంత్రి సత్యనారాయణ అన్నారు.

Related posts

రాహుల్ గాంధీ లేడు.. నేనే చంపేశాను…

Satyam NEWS

మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దర్యాప్తు చేపడుతున్న AHTU బృందాలు

Satyam NEWS

“అనన్య” అసాధారణ విజయం సాధించాలి

Satyam NEWS

Leave a Comment